పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/209

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదియారవ ప్రకరణము.

195


ద్వారా ఈవిశ్వచక్రము నడుచుచున్నదో ఆపరమ దైవమునదీమహీ -యనీ, *[1]

ఈసమస్త జగత్తును ప్రాణ స్వరూపుడగు పరమేశ్వరునుండి నిస్సృత మైనది.

ప్రాణ స్వరూపుడగు పరమేశ్వరుని అవలంబన చే నడుచు చున్నది. " +[2]

ఈ దేవత, ఈ విశ్వకర్మ, ఈమహాత్ముడు సర్వదా లోకుల హృదయములలో సన్ని విష్ణుడై యున్నాడు ”***[3]

ఈమూలతత్వము యొక్క యీఅప్రతిహత సత్యములు ఋషీ శ్వరుల పవిత్ర హృదయముల ఉచ్ఛ్వాసములు.

సమ్ముఖమందున్న వృక్షమును చూచుచున్నాము, స్పృశించు చున్నాము. కాని ఆవృక్షము ఏ ఆకాశము ! Space ) సందున్నదో ఆయాకాశమును మనము చూడజాలము, స్పృశింప జాలము. కాలాను సారముగ వృక్షమునకు శాఖలు బయలు దేరును, పల్లవములు ద్భవిం చును, పుష్పములు ఫలములు చూపట్టును. ఇదంతయు మనము చూడగల్గుచున్నారము. గాని దానిలో నుండు కాలసూత్రమును చూడజాల కున్నాము. వృక్షము, ఏ జీవనశ క్తి ప్రభావమువల్ల వేళ్ళనుండి రసము నాకర్షణచేసి తాను పుష్టి నొందుచున్నదో, ఏశక్తి దాని పత్రముల యొక్క ప్రతినాళము నందును పనిచేయు చుండునో, ఆశశక్తి ప్రభావ మును మనము చూచుచున్నాము. కాని ఆశక్తి నిమాత్రము మనము చూడజాల కున్నాము. ఏ విజ్ఞానమయ పురుషునివల్ల వృక్షము

+

+ “

  1. స్వభావ మే కే కవయోవదన్తి, కాల స్తధా స్య పరిముహ్యమ నాః | దేవ స్యైషమహిమాతులో కే యే నేదం శ్రావ్య తే బహ్మచకం |||
  2. "యదిదం కించ జగత్సర్వం ప్రాణ ఏజతినిఃసృతం | '
  3. ఏష దేవో విశ్వకర్మా మహాత్మా సహజ నా నాం హృదయే సన్ని ఇష్టః, "