పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

188

మహర్షి దేవేంద్రనాధ శాకూర్ స్వీయచరిత్రము



. చూచు సరికి పర్వతము దీపమాలాశోభితమై యుండెను. సాయంకాల మవసానమై రాత్రి యభివృద్ధి నుందిన కొలదియు నాయగ్ని మరింత వ్యాపింప దొడగెను.పైనుండి అగ్ని బాణములవలె, నక్షత్ర వేగముతో, శత సహస్ర సుఖ్యాకములగు విస్ఫులింగములు పతనము నొంది నదీతీర పర్యంతము వ్యాపించియున్న వృక్ష సముదాయమునకు ఆక్రమణ గావించెను. క్రమక్రమముగ నొక్కక్కటిగ నా వృక్షసముదాయ మంతయు స్వీయ కూపమును పరిత్యజించి అగ్నిరూపమును ధరించెను. ఆస్థానమునుండి అంధ తిమిరము బహుదూరము పలాయన మయ్యెను. అగ్ని యొక్క ఈ అపరూపరూపమును చూడగ చూడగ, అగ్నిలో నివసించు నా దేవత యొక్క మహిమానుభవము చెంద నారంబించితిని, ఇంతకు పూర్వమునే ననేక వనములందు దావానల నీదర్నశకములగు దగ్ధ వృక్షముల ననేకముల జూచితిని, రాత్రి వేళల, దూరస్థములగు పర్వతములను ప్రజ్వలించుచుండిన అగ్ని యొక్క శోభను దర్శనము గావించితిని. కానీ ఇచ్చట దావానలము యొక్క ఉత్పత్తి, వ్యాప్తి, ఉన్న తి, నివృత్తి అంతయు ప్రత్యక్షముగ జూచి "నేను మిక్కిలి ఆహ్లాదము నందితిని. రాత్రియంతయు నీదావా నలము జ్వలించుచుండెను. రాత్రి మెలకువ వచ్చినపు డెల్ల దాని యొక్క ప్రకాశమును జూచుచుంటిని. ప్రాతః కాలమున లేచి చూచు సరికి అనేక దగ్ధ వృక్షములనుండి ధూమము వెడలి వచ్చుచుండెను. ఉత్సవరజనీప్రభాత కాలమున అవశిష్ట దీప కాంతులవలె మధ్య మధ్య నా సర్వనాశంకరమగు దావానలము మ్లానమై, అవసన్నమై జ్వలించు చుండెను. నేనుపోయి నదిలో స్నానము చేసితిని. ఒక యిత్తడి చెంబుతో నీళ్లు శిరస్సుపై బోసికొను చుంటిని. జల మతిశీతలముగనుండెను. శిర స్సునందలి మెదడు ఘనీభవించిపోవునా యనునట్లుండెను. స్నానము,