పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

187

ముప్పదియైదవ ప్రకరణము,


గతదినమున ' శుంఘ్రీ ' నుండి క్రమముగ దిగి 'బోఆలీ' కి వచ్చితిని. నేడును అట్లే ప్రాతః కాలమున ఇచ్చటనుండి అవరోహణగావించి అపరాహ్నమున నగరీనదీ తీరమును చేరితిని, మహా వేగవతియు స్రోతస్వతీయునైన యీనది స్వీయగర్భమున దాల్చిన మదకరుల బోలిన ప్రస్తర ఖండముల డీకొని రోష పూరితమై, ఫేనమయమై, గంభీర శబ్ద ముతో సర్వనియంత శాసనము ననుసరించి సముద్ర సమాగమునకు పోవుచుండెను. ఉభయతీరముల నుండి రెండు పర్వతములు, మహాప్రా చీరములవలె వి శేషౌన్నత్యమునకు లేచి "వెనుక ప్రక్కకు వాలుచుండెను. సూర్య కిరణములు చాల సేపిచట నిలచి యుండుటకు చోటు లేదు. ఈనది పైన నొక సుందరమగు సేతువుండెను. దీనిమూలమున నే నానది యా వలియొడ్డును చేరి శుభముగ నున్న యొక్క చిన్న బంగాళాయందు విశ్రమించితిని. ఈలోవ మిగుల రమ్యముగను, ఏకాంతముగ నుండెను. దశక్రోశముల మధ్య నెక్కడను ఒక్క మనుష్యుడు గాని గ్రామముగాని లేదు. ఒక మనుష్యుడు మాత్రము ఒక గదిలో తన భార్యాపుత్రులతో నిచట నివసించు చుండెను. దానిని గదియని కూడ చెప్పవీలు లేదు. అది పర్వతములోని గహ్వరము. ఇచటనే వారి వంటయు నీద్రయును. అతని భార్య యొక శిశువును వీపుపై పరుండ బెట్టుకొని ఆహ్లాదముతో నృత్యము చేయుచుండెను. ఇంకొక బిడ్డ పర్వతముపై నపాయ కగమగు నొక స్థలమున నవ్వుచు గంతులు వేయుచుండెను. తండ్రి యొక చిన్న పొలమున బంగాళాదుంపలు నాటుచుండెను. ఇచ్చట వారిసౌఖ్యమునకు వలయునదంతయు నీశ్వరుడు సమకూర్చి యుండెను. సింహాసనాసీనులగు రాజేంద్రులకుగూడ నిట్టి శాంతి సౌఖ్యములు దుర్లభములు.

సాయం కాలమున నేనీ నదీ సౌందర్యముచే మోహితుడనై, ఏకా కినై దాని తీరమున నొంటిగ విచరణ గావించుచుంటిని, అఠాత్తుగ పైకి