పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదీసాల్గవ ప్రకరణము.

175


సమ్ముఖమున నే పెట్టె తెరచి ఒక్కొక్కనికి 3 రూపాయిలిచ్చితిని. ఆసర్దా రుకు 5 రూపాయిలు పురస్కారమిచ్చితిని. ఈసమయములో కిశోరి వచ్చెను.

“ఈసంకట సమయములో నీవిందుండి ఏల పోతివి?” అని అడిగి

తిని, “ఒక దర్జీవాడు నాబట్టలు కుట్టినందుకు నాలుగణాలు ఎక్కువడి గెను. బేరము కుదుర్చుసరికి ఆలస్యమయ్యేనని ఆతడు చెప్పెను.

డోలీ నెక్కి 'డాగ్సాహీ' (Dayshahi) యను నొకకొండకై బయలు వెడలితిని. దినమంతయు పయనము చేసిన వెనుక సూర్యాస్తమయ సమయమున నన్నొక ప్రస్రవణమువద్ద దింపి కూలీలు నీరు త్రాగి, కూర్చుండి, పరస్పర సంభాషణము, హాస్య పరిహాసములు చేసికొన నారంభించిరి. వారు మాట్లాడు దానిలో ఒక్క ముక్క యైనను నాకర్ధము కాకుండుటచే నారునన్ను చంపి నాసొమ్మంతయు తీసికొనుటకు ప్రయ త్నించుచున్నారని భావించితిని. వీరు ఈ నిర్జనారణ్యములో ఈ కొండ పై నుండి నన్ను కిందికి పార వేసినచో ఎవ్వరును కనుగొన జాలరు కదా! కాని యిదంతయు కేవలము నామనస్సు యొక్క వృధాసంకోచము. వారు నీరు ద్రావి, కొంచెము బలము తెచ్చుకొని తిరిగి బయలు దేరి, అర్ధరాతికి నన్నొక బజారులో దింపిరి. ఆ రాత్రి అచట గడపిన పిమ్మట నేను మరల బయలు దేరితిని. నా జేబులోని రూపాయీలు కొన్ని విడి డబ్బులు పక్క మీద పడిపోయెను. కూలి వాండ్రవన్నియు నేరి నాకు దెచ్చియిచ్చిరి. ఇందువల్ల వారిపై నాకు విశేషవిశ్వాసము జనించెను.

మధ్యాహ్నమునకు డాగ్సాహి చేరితిమి. అక్కడ నన్నొక పెంకు టింటివద్ద దింపి కూలీలు పోయిరి. సంధ్యా సమయమునకు కిశోరి వ చ్చెను. నివసించుటకొక పాడుపడిన గదియు, పరుండుటకొక నులక మంచము నాకు దొరకెను. దీనితో రాత్రి కాలక్షేపము చేసితిని. ఉదయముననే లేచి పర్వత శిఖరమునకు పోతిని. ఖాళీ సారాయపు పెట్టెలు(Wine Boxes) చుట్టును గోడవలె పేర్చి ఆంగ్లేయ సైనికులు