పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/183

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ముప్పదినాల్గవ ప్రకరణము.

171


చితిని. ప్రభాతమున నిద్రనుండి లేచితిని. ఇంకను జీవించి యేయుంటిని. ఘూర్కాలు మామీదికింకయు రాలేదు. బయటకు పోయి చూడగా, సర్కార్ ఖజాన వద్దను, కచ్చేరులన్నిటి వద్దను, వీధులలోను, ఆయుధ పొణులగు ఘర్కాలు పహరాయుంచబడిరి. .

ముప్పది నాల్గవ ప్రకరణము.


దానిని చూచి జ్యేష్ఠ పాడ్యమి దివసమున సిపాయీల విద్రోహమువలన ఢిల్లీ లోను, మీరట్ లోను ఘోరతరహత్యలు సంభవించెనని సిమ్లాకు వర్త మానము చేరెను. జ్యేష్ఠ శుద్ధ విదియనాడు ప్రధాన సేనానాయకుడగు జనరల్ ఆర్సన్" (General Arson) శుబ్రముగ క్షౌరము చేసికొని, ఒక పొట్టిగుర్రము నెక్కి సిమ్లాకు వచ్చెను. సిమ్లాకు అనతి దూరము ననే యొక ఘూర్కా సైన్యదళముండెను. మార్గమధ్యమున యాదళము యొక్క కెప్టనున్ కు, “ఘూర్క సైనికులను నిరస్త్రులను గావింపుము " అని హుకుం యిచ్చెను. ఘూర్కాలు నిర్దోషులు. సిపా యీలతో వీరికి స్నేహము లేదు. ఏ సంబంధము లేదు. కానీ, నల్ల సిపొయీలందరు ఒకటేయని దొరలు పొరబడి అనాలోచితముగ ఘూర్కాలను నిరస్త్రుల జేయ నాజ్ఞాపించిరి. కెప్టన్, “ఆయుధములిచ్చి వేయుడని” వారి నాజ్ఞాపింపపగానే, వారు అవమానింప బడినట్లును, అగౌరవము చూపబడినట్లును భావించిరి. ప్రధమమున వారిని నిరస్తులను గావించి పిమ్మట ఫిరంగులతో కాల్చెదరని వారు భావిం చిరి. ఈయుద్దేశముతో ప్రాణభయముచే వారందరు ఆలోచనయం దును క్రియయందును ఏకమైరి. వారు సేనాధిపతి ఆజ్ఞ మన్నింపలేదు. ఆయుధము లివ్వ లేదు. ఇంతేగాక ఆంగ్లేయ ఉద్యోగస్థుల నందరిని బంధించి జ్యేష్ఠ తదియ వాడు సిమ్లాను ఆక్రమించుటకు దాడి వెడలిరి.