పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

6

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్రము.

వేదవ్యాసుని నారదుడు తన పూర్వజన్మ వృత్తాంత

మీక్రింది విధముగా చెప్పెను.


[నారదుని పూర్వజన్మవృత్తాంతము.]

వ. మహాత్మా నేను పూర్వకల్పంబునం దొల్లిటి జన్మంబున వేదవాదుల యింటి దాసికిం బుట్టి పిన్న నాడు వారలచే బనుపంబడి యొక్క వాన కాలంబునఁ జాతుర్మాస్యంబు ననేక స్థల నివాసంబు సేయ నిశ్చయించిన యోగి జనులకుం బరిచర్య సేయుచోట.

•••

వ............. నాయందు ... ... ... అమ్మహాత్ములగు యోగి జనుల మూలంబున రజస్తమోగుణ పరిహారిణి యైన భక్తి సంభవించెనంతఁ జాతుర్మాస్యంబునిండిన నయ్యోగి జనులు యాత్ర సేయువారలై రివ్విధంబున.

మ. అపచారంబులు లేక నిత్యపరి చర్యాభ క్తి యుక్తుండనై
చపలత్వంబును మాసి నేగొలువగా సంప్రీతులైవారు ని
ష్కపటత్వంబున దీనవత్సలతతో గారుణ్య సంయుక్తులై
యుపదేశించిరి నాకు నీశ్వరరహస్యో దార విజ్ఞానమున్


వ. ఏనును వారి యుపదేశంబున వాసు దేవుని మాయానుభవంబు దెలిసితి.

•••

వ. ......దాసీపుతుండనయిన నేను భిక్షుకులవలన హరిజ్ఞానంబుగలిగి యున్నంత.

సీ. మిమ్మునేలినవారి మందిరంబునుగల
                పను లెల్లఁగ్రమమున భక్తి చేసి