పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/161

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

149

ముప్పదవ ప్రకరణము.


ఇతని వదాన్యత,ప్రియవ్యవహారము లోకుల మనస్సులను విశే షముగ నాకర్షించు చుండెను. ఒక నాడొక ఋణప్రదాత సొమ్ము కొరకు కొంచము తీవ్రోక్తులాడ జొచ్చెను. దీనితో నతడు నా చెంత కన్నీరు కార్చుచు వచ్చి “నాఋణదాత యొకడు నేనతనికి వ్రాసియిచ్చిన 'నోటు' పై నీసాక్ష్యము లేకున్నచో నన్ను విడిచి పెట్టకున్నాడ ” నియెను. “నాకున్నదంతయు నీకిచ్చి వేయగలను కాని నేనే 'నోటు'ను, పత్రమును మాత్రము సంతకము చేయజాలను. ఇదివరకు మనకున్న అప్పులే తీర్పజాల కున్నాను. అట్టిస్థితిలో ఈ నూతన ఋణమువల్ల బద్ధుడను కాజలను, ఇకెన్నడును నేను బుద్ధిపూర్వకముగా ఋణమును పాపా నలములో దిగబడను." అని నేను చెప్పితిని. నేనిట్లు చెప్పుటవిని, ఒక గోడకు జేర బడి అతడు మూడు గంట లేడ్చెను. అతనిఏడుపుచూచి నాగుండెలు బ్రద్దలగుచుండెను గానినే నాతని 'నోటు మాత్రము సంతక ముచేయ జాలనై తిని, మన గాలింపూర్ పట్టుయంత్ర శాలలవల్ల వచ్చుసొమ్మును, మనకున్న పుస్తకములన్నియు నమ్ముటవల్ల వచ్చు సొమ్మంతయు నీవు తీసికొనుము "నేని చ్చెదను. కానీ ఋణము తీర్చు ఉపాయమేదియు తెలియకుండ నేను ధర్మమునకు విరుద్ధముగ అప్పు పత్రము సంతకము చేయజాలను " అని నేనతనితో నంటిని. అతడు విశేషదుఃఖమును అసంతుష్టియు చెందెను. తన అన్నగారు తనకు సహాయము చెయ్య లేదను అభిమానముతో యిల్లు వదలి మాపినతండ్రి రామనాధ రాకూరు గారింట్లో వాసము చేయ నారంభించెను. అటు పిమ్మట 'నేనతనికొక 8,000 రూపాయల 'నోటు' సంతకము చేయవలసి వచ్చెను. మాకున్న పుస్తకములన్నియు అమ్మి ఈ ఋణమును వెంటనే తీర్చెదననియు దాని విషయమై నా కేమియు శ్రమకలుగ జేయననియు నతడు నాతో వాగ్దానము చేసెను.

అప్పటికిని నాగేంద్ర నాధుడింటికి రాలేదు. ఇంకను మాపిన