పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

148

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్రము.


సంపూర్ణముగ సమ్మతించిరనియు, దీనిలో నందరు సంతుష్టి.చెందిర నియు తెలిసికొంటిని. ఇంతవరకును ఎవ్వరు దానిక భ్యంతర పెట్ట లేదు. బ్రాహ్మ సమాజము బహుభంగుల భిన్న మైపోయినప్పటికిని ఈ బీజమం త్రమే ఈశ్వర ప్రసాదమువల్ల బ్రాహ్ములందరకును ఐక్యస్థలముగా నున్నది. కావుననే బ్రాహ్మసమాజపు 28 వ వార్షికోత్సవము నందొక నిష్టావంతుడును, ఆలోచనా శీలుడును అగు ఒక బ్రాహ్ముడు తన ఉపన్యా సమునందు ఈ బీజమును గూర్చి యిట్లు ప్రశంసించెను. “ సత్యము సమాదరింపబడునంత పర్యంతము, మానవహృదయ సింహాసనములో వివేకము రాజ్యము చేయునంత పర్యంతము, ఈసిద్ధాంతము మానవ ప్రకృతిని తప్పక విభూషితము కావించును.”

ముస్పదవ ప్రకరణము.

తుట్టతుదకు ఈ పది సంవత్సరముల లోను మాఋణములు చాల వరకు తీరిపోయెను. పితృఋణము యొక్క మహాభారము, చాలవరకు తగ్గిపోయినది. కాని మరియొక విధమగు నూతన విపద్భారము ఋణ భారము నన్ను దుఃఖములో ముంపసాగెను. గిరీంద్రును జీవించి యుండు సపుడు తన స్వంత ఖర్చుకొరకు విశేష ఋణములు గావించి యుండెను. మాపితృ ఋణములతో పాటు ఇదికూడ కొంతవరకు తీర్చి వేసితిని. ప్రస్తు తము మరల నాగేంద్ర నాధుడు తన స్వంతము కొరకు అధికముగా ఋణముచేయ నారంభించెను. కేవలము తనకొర కే కాదు, ఇతరులకు సహాయము చేయుటకు కూడ 10,000 రూపాయలైన నతడు ఋణము చేయును. అతడు పరుల దుఃఖములందంత దుఃఖిగను, దయాళుడుగ నుండెను.