పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

142

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్రము.


మాయా వ్యూహములో చిక్కుకొంటిని గదా యని 'తెలిసి కొంటిని. చిట్టచివరకు మిక్కిలియలసి సొలసి నేలపై పడిపోతిని. స్వప్న రాజ్యము నా నమయ్యెను. చైతన్యము చెందిన పిమ్మట ఈజగన్నాధ పురమే మాయా దేవిపురి యని తెలిసికొంటిని.” అని నేను చెప్పితిని.


ఆపండాకు నేను చెప్పిన దేమియు అర్ధముగాక అతడు వెళ్ళి పోయెను. ఇంతలో మహా ప్రసాదము యొక్క గోల. దానితో నపరిమి తానందము.జమాదార్లు, బాహ్మణులు, అనేకులు అందరు మహాప్ర సాదమునందు కొని ఒకరి నోటిలో నొకరు వేయ నారంభించిరి. అప్పుడు బాహ్మణ శూద్ర వివక్షత లేదు. అందరు నేకమై ఆనందించిరి. ఓడ్రులు ధన్యులు. ఈవిషయములో వారు నెగ్గిరి. వారన్ని కులములు 'నేకము చేసికొనిరి.


పూరీ'నుండి తిరిగి కటకమునకు వచ్చితిని. అచ్చట దిగగానే మాజమీందారీ దివాను 'రామచంద్రగంగుళీ చనిపోయెనన్న వార్త వింటిని. అతడు రామమోహన రాయ్ కి దగ్గర బుధువు. అతని కుమా రుడగు రాధాప్రసాద రాయ్ కి పరమమిత్రుడు. బ్రాహ్మసమాజమున కతడే ప్రధమసం పాదకుడు. అతని కర్మదక్షత కనిపెట్టి మాతండ్రిగా రతనిని మాసమస్త జమీందారీలకు దివానుగా నియమించెను. అతడిప్ప టివరకు మాయ ధీనములోనే యుండి అతినిపుణముగా జమీందారీ వ్యవహారములన్నియు చక్క బెట్టుచుండెను. అతని మరణవార్త విని 1851వ సం||రం జ్యేష్ఠమాసములో కటకము నుండి ఇంటికి తొందరగా మాజమీందారీని గూర్చి కొత్త యేర్పాటుల జేయదొడగితిని.