పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

130

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్రము,



యుండెను. చిర ప్రచలిత పూజలు, యుత్సవములునూ భద్రాసన గృహమునుండి ఎత్తికట్టుట, అందరి మనస్సులకు కష్టము కలుగ జేసి అందరిమతులకు విరుద్ధముగ చేయుట నొక గర్తవ్యమని తోచలేదు. 'నేనుమాత్రము దూరముగ నుండి వానిలో సేవిధమైన జోక్యము కలుగ జేసికొనకుండుటే మంచిదను కొంటిని. నా పరివారములో వానిలో భక్తివిశ్వాసము లుండు వారిమనస్సు నొప్పించుట అకర్తవ్యము. మాసోదరుల యాలోచన తోడను అనుమతి తోడను నెమ్మదిగా పూజలనాపి వేయుటకు ప్రయత్నించితిని.


మాకనిష్ఠ బ్రాత నాగేంద్ర నాధుడీ మధ్యనే ఐరోపానుండి తిరిగివచ్చెను. అతని ఉదార మనస్సును ప్రశాంత భావమును చూచి, అతడు ప్రతిమాపూజకు విరోధియై నావాదమును సమర్ధించునని ఆశ పడుచుంటిని. కాని యీ ఆశ నిరాశయయ్యెను. సమాజ బంధమునకును, బంధుసమ్మేళమునకును, అందరిలో సద్భావము స్థాపించుటకును దుర్గ పూజ యొక ఉత్కృష్టమైనట్టియు ప్రశస్తమైనట్టియు ఉపాయమనియు, దానిపై హస్తక్షేపము చేయుట ఉచితము కాదనియు, చేసినచో నందరిమనస్సులు నొచ్చుననియు అతడు నుడివెను. నాయుపదేశ మూలమునను అనురోధమూలమునను జగద్ధాతి పూజ మాత్రము మానిరి. అప్పటినుండియు జగద్ధాతి పూజను మాయింటనుండి శాశ్వతముగా తొలగించితిమి. దుర్గ పూజ మాత్రము జరుగుచునేయుండెను.


నేను బాహ్మధర్మము గ్రహించిన సమయము నుండియు ఆరంభించిన పద్ధతి. అనగా దుర్గ పూజా సమయములో నూరు విడిచి వెళ్లుచుండుట ఇంకను ముగియ లేదు. ఆశ్వయుజ మాసము వచ్చిన తోడనే ఏటేట "నేనెక్కడికో ఒక చోటికి వెళ్లుచుంటిని. ఈసారి 1819 వ సంవత్సరములో పూజలనుండి దూరమగుటకు అస్సామ్ కు బహిర్గతుడనై తిని,