పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

118

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్రము.



యమునందావిర్భూతమయ్యెను. అటు పైనిట్లంటిని. “ఆనందా ధ్యేవఖల్విమాని భూతానిజాయస్తే , ఆనందేనబాతాని జీవంతి ఆనందం ప్రయస్త్యభిసంవిశంతి "— నిశ్చయముగా ఆనంద స్వరూపుడగు బహ్మవలననే ఈ భూతములన్నియు ఉత్పన్నమగుచున్నవి. ఉత్పన్నమయి ఆనందస్వరూపబ్రహ్మమువల్లనే జీవించుచున్నవి. ప్రళయ కాలమున ఆనంద స్వరూపునిగూర్చియే పోయి ఆయనలో ప్రవేశించుచున్నవి.------


ఆదియంను కేవలము జన్మవిహీన మగుఒక్క ఆత్మ, ఆ పరబ్రహ్మమాత్రమే ఉండెననియు, వేరేదియు లేదనియు తెలిసికొంటిని. వెంటనేయిట్లంటిని. “ఇదంవా అగ్రేనై వకించి దాసీత్ | సదేవ సౌమ్యేదమగ్ర ఆసీ దేక మే వాద్వితీయమ్ | సవాఏష మహానజ ఆత్మార్టరోర్మరోర్మృ,తోర్భయః ” _ ఈజగత్తునకు పూర్వ మేదియును లేదు. ఓ ప్రియశిష్యా ! ఈజగదుత్పత్తికి పూర్వము అద్వితీయ సత్స్వరూప పరబ్రహ్మ మాత్రముండెను. అతడు మహాత్ముడు,జన్మవిహీనుడు, పరమాత్ముడు,జరామరణములు లేనివాడు, నిత్యుడు, భయరహితుడు... దేశము, కాలము, కార్యము, కారణము, పాపము, పుణ్యము, కర్మఫలము,మొదలగు వానినిగూర్చి ఆలోచించి ఈజగత్తును ఆయన సృష్టించెనని కనుగొంటిని. “ సత పోర ప్యత సతప స్తప్తా ఇదగ్ సర్వమ్ సృజతాయదిదంకించ.” అతడు విశ్వసృజనవిషయమై ఆలోచన చేసెను. ఆలోచించి

ఈ అన్నిటీని సృష్టి చేసెను...... పత స్మాజాయతే ప్రాశోమనః సర్వేంరియాణిచ,ఖంవాయురోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణీ "..... 

వేనిఆధారమునుండి పృధివి ఉత్పన్న మయినదో అట్టి జలము, వాయువు, అగ్ని మొదలయిన వన్నియును; మరియును ప్రాణము, మనస్సు, ఇంద్రియ సముదాయము, కేవల సర్వశక్తినంతుడైన యూపూర్వపురుషుడు తన యిచ్ఛచే సృష్టిచేసెను. ఆయన అనుశాసనమువల్ల సకలములును శాసితములగు చున్నవని కనుగొంటివి.