పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువది రెండవ ప్రకరణము.

113



కఠోపనిషత్తునందలి యొక ఉపాఖ్యానములో మృత్యువుతో నచికేతుడు స్వర్గమును గురించి ఈరీతిగ వర్ణించెను. " స్వర్గేలో కేసభ యం కించనాస్తి సతతత్వం నజరయావి భేతి ఉధేతీర్త్వా ఆశనాయా పిపాసే శోకాతిగోమోద తేసర్వలోకే”. " స్వర్గమునందు ఏమియు భయము లేదు. మృత్యువా, నీవచ్చట లేవు. వృద్ధాప్యము కూడ అచట లేదు. క్షుత్పిపాసలనుండి యుత్తీర్ణమై శోకము నతిక్రమించి ఆదివ్యాత్మ స్వర్గలోకమునందు ఆనందము నందుండును. "


ఈ ప్రపంచమందు పాపానుష్ఠానము గావించిన పాపుల గతి యేమి? ఇక్కడ పాపములు చేసి ఆ చేసిన పాపములకు పశ్చాత్తాపము నొందనివాడు దానిలో నుండి నివృత్తి చెందక పునఃపునః పాపాచరణమే గావించుచుండి మరణానంతరమున పాపలోకమే చేరును.


“పుణ్యేన పుణ్యంలోకన్న యతి పాపేన పాపం”. పుణ్యముద్వారా పుణ్యలోకమునకును పాపమునుద్వారా పాప లోకమునకును దిగుదుము.


ఇది 'వేద వాక్యము. పాపము యొక్క తారతమ్యము ననుసరించి తదుపయుక్తమైన పాపలోకమునకు పోయి, ఆపాపి యొక్క ఆత్మ పాపాశ్రిత దేహము ధరించి, అక్కడ ననేక కుటిల పాపముల అనుతాపాగ్నియందు దగ్గముదగ్ధము గావింపబడి, అప్పుడు తన పాప సమూహమంతయు భశ్మీభూతమై, తనప్రాయశ్చిత్త మవసానమై దాని ప్రసాదమును పొందును. అటుపిమ్మట 'తానీ పృధివియందు సంపాదించిన పుణ్యమునకు ఆపుణ్య బలమువల్ల దానికనుగుణ్యమగు పుణ్యలోకము పశుభావమునకు వ్యతిరేకమైన దేవశరీరధారణ గావించి పుణ్యఫల మనుభవించును. ఎంతవరకు జ్ఞానము, ధర్మము, పుణ్యము సంపాదింప గలుగునో తదనుసారముగ నింకను ఉన్నత లోకములను చెందును,