పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/124

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్రము.


ములు అధ్యయనము చేసి గురుశుశ్రూష యొనర్చిన పిమ్మట ఇంటికి పోయి వివాహానంతరమున ఒక పవిత్ర స్థానమునందు 'వేదాధ్యయనము గావింపుము. నీశిష్యులకును, ధార్మిక పుత్రులకును జ్ఞానోపదేశము చేయుము. నీ ఆత్మయందు ఇంద్రియములను ప్రతిష్ఠితము చేసికొని ఏ ప్రాణికినినీవు పీడా దాయకుడవు గాకుండి న్యాయార్జితమైన విత్తము ద్వారా నీజీవసము పోషించు కొనుము. ఈ విధముగా ఇహలోకమునందు

యావజ్జీవమునుగడపిన వాడు మరణానంతరమున బ్రహ్మలోకము 

ప్రవేశించును.మరెన్నడును ఇహలోకము నకు ప్రత్యాగమనము గావింపడు—-


ఏవ్యక్తి ఇహలోకమందు ఈశ్వరాదిష్ట ధర్మానుష్ఠానముచే ఆత్మను పవిత్రము చేసికొనునో ఆవ్యక్తి ఈ పృధివినీ వదలిన వెంటనే పుణ్యలోకమునకరిగి పశుభావమును పరిత్యజించి దివ్యశరీరమును ధరించును. ఆ పుణ్యలోకము నందు ఈశ్వరుని జాజ్వల్యతర మహిమను చూచి, జ్ఞానము సందును, ప్రేమయందును, ధర్మమునందును ఔన్నత్యముగాంచి ఇంకను ఉన్నతతరలోకమునకు గొనిపోబడును. ఈ ప్రకారముగా ఔన్నత్యమునుండి ఔన్నత్యము పొందుచు, పుణ్యలోకమునుండి పుణ్యలోకమునకు పోవుచు, అసంఖ్యాక స్వర్గములనుండి స్వర్గ లోకములకు పోవుచుండును. “ఏష దేవ పథోపుణ్య పథః" ఈ ప్రపంచమునకు ఇక తిరిగి రాకుండును. స్వర్గలోకమునందు పశుభావము లేదు. కుత్పిపాసలు లేవు. స్త్రీల యెడలను ధనము యెడలను కాంక్ష లేదు. కామము లేదు. క్రోధము లేదు. లోభము లేదు. అచ్చట చిరజీవము, చిరయావనము ఉండును. ఈరూపముగా స్వర్గముము నుండి స్వర్గమునకు జ్ఞానము యొక్కయు, ప్రేమయొక్కయు, మంగళము యొక్కయు ప్రవాహములు ప్రవహించి ఆదివ్యాత్మను అనంతోన్న త్యాభిముఖముగా కొనిపోయి అతః హృగయము నుండి ఆనందోత్సవమును సర్వదాయు త్సొరితము గావించుచుందును.