పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువది రెండవ ప్రకరణము.

111


ఎవరు తమ స్వగ్రామములలో నుండి యాగయజ్ఞాదికర్మకాండముల ననుష్ఠించెదరో వారు మరణానంతరమున ధూమ ప్రపంచమును చేరుదురనియు, ధూమమునుండి రాతిలోనికి, రాతినుండి కృష్ణ పక్షమునకును, కృష్ణ పక్షమునుండి దక్షిణాయనమాసములకును, దక్షిణాయననూసములనుండి పితృలోకమునకును, పితృలోకము నుండి ఆకాశమునకును, ఆకాశమునుండి చంద్రలోకమునకును వెళ్ళుదురనియు, ఆచంద్రలోకమునందు స్వీయ పుణ్య ఫలము లనుభవించిన పిమ్మట ఈప్రపంచములో పునర్జన్మము మొందు నిమిత్తము చంద్రమండలము నుండి ఆకాశములోనికి పడుదురనియు, ఆకాశము నుండి వాయువు లోనికి, వాయువునుండి ధూమమై, ధూమమునుండి ఆవిరియై, ఆవిరినుండి మేఘమై మేఘమునుండీ వర్షితులై వారిచ్చట గోధుమలుగను, జొన్నలుగను, ఓషధులుగను, వనస్పతులుగను, తీలలుగను, కాయధాన్యములుగను, బయలు దేరుదురనియు ఉపనిషత్తులలో చదివితిని. ఆగోధుమలు మొదలగు వానిని ఎవరెవరు భక్షింతురో ఆయా స్త్రీపురుషులనుండి వారిక్కడ జీవులై జన్మగ్రహణము నొందుదురట. ఈవాక్యములన్నియు నాకు అయోగ్యకల్పనలుగా తోచెను. అందువల్ల వీనిని నేనంగీకరింప లేక పోతిని. ఇట్టి భావములు సహజముగా నాహృదయము యొక్క అనువాదములు కావు.


కాని ఉపనిషత్తులలోని యీకింది మహావాక్యముతో సంపూర్ణ రూపముగా నాహృదయము ఐక్యము చెందెను. “ఆచార్యకులో ద్వేద నూత్యయధావిధానంగురో ! కర్మాలి శేషేణా భిసమావృత్య కుటుంబే శుచౌదేశ స్వాధ్యాయమధీయా నోధార్మికాన్విదధత్ అత్మాని సర్వేనియాగాణి సంప్రతిష్టా ప్యాహింసన్ సర్వభూతాన్యన్యత తీర్దే భ్యః సఖ ల్వే వంవర్తయన్ యావదాయుషం బ్రహ్మలోకమభిసం పద్య తేనచ పునరావర్తతేనచ పున రావర్తంతే”. నీగురునివాసమువద్ద వేద