పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/122

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్రము


.



వేసి 'కేవలము ఆ ఉపనిషత్తులమీదనే ఆధార పడితిని. కాని సోహం అస్మి”, “తత్వమసి" మొదలగునవి గాంచినపుడు ఉపనిషత్తులయందు కూడ నిరాశ చెందితిని.

ఈయుపనిషత్తులు కూడ మాయభావములను దూరము చేయ లేక పోయెను; మాహృదయములను పూర్ణము గావింప లేక పోయెను. ఇంక ఏమి చేయవలెను? మాకింక ఉపొయ మేమి? ఇక బ్రాహధర్మమునకు ఎక్కడ ఆశ్రయమివ్వగలము? వేదములను ఉపనిషత్తులను దానిపునాదులుగ చేయవీలు లేదు. ఇక దాని పునాదులు నిర్మించుటెక్కడ?

చూచితిని. ఇంక ఆత్మహత్యయ సిద్ధజ్ఞానోజ్వలిత విశుద్ధహృదయమే దాని పునాది స్థానమని కనుగొంటిని. పవిత్ర హృదయమునందే బ్రహ్మము యొక్క అధిష్ఠానము. హృదయముతో ఉపనిషత్తు "లెక్కడ మిళితము చెందునో అట్టి ఉపనిష షద్వాక్యములమాతము గ్రహింపగలిగితిమి. హృదయముతో ఏది ఐక్యము చెందకుండెనో ఆవాక్యములనుమేము గ్రహింపజాల కుంటిమి. సకల శాస్త్రములలో శ్రేష్ఠములగు ఉపనిషత్తులకును మాకును గల ప్రస్తుత సంబంధమిదియే. “నిష్పాపప్రశాంత హృదయము యొక్క విరుద్ధ భావమునందు ఈశ్వరుడు అభిప్రకాశితుడగును, ” * [1]అని యుపనిషత్తులలోనే యున్నది. పవిత్రవంతుల ఆత్మకు ఈశ్వరజ్ఞానము ప్రసాదింపబడు చుండును. పూర్వము ధ్యాన యోగమువల్లను జ్ఞాన ప్రసాదము వల్లను తమ శుద్ధహృదయములలో బ్రహము నాదర్శించిన ఋషీశ్వరునిచే పరీక్షితమైన విషయమిదియే. "జ్ఞానప్రసాదేనవిశుద్ధ సత్వ స్తతస్తుతం పశ్య తే నిష్కలం ధ్యాయమానః"


ఈ పదములు నాస్వానుభవముతో మిళితము చెందెను. కావున వాని సంగీకరించితిని.

  • హృదామనీ సా మనసాభి క్లప్త ||