పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువది రెండవ ప్రకరణము.

109



శ్రీకృష్ణుడు పరబ్రహ్మయని వ్రాసిరి. గోపీ చందనోపనిషత్తు అని ఇంకొకటి ఉండెను. అందులో తిలక మేరీతిగా చేయ్యబడెనో చెప్పబడి యుండెను. ఈరీతిగా వైష్ణవులు తమ దేవత యొక్క మహిమను ఘోషించుచుండిరి. అదేరీతిగా స్కంధోపనిషత్తు అను మరి యొక గ్రంధము నందు శైవులు శివుని మహిమ సాటించిరి. సుదరతపనీ ఉపనిషత్తు, దేవీ ఉపనిషత్తు, కౌలో పనిషత్తు మొదలగు మరికొన్ని కూడ ఉండెను. వానిలో కేవలము శక్తి మహిమా ప్రచారము చేయజొచ్చిరి. అక్బరు కాలములో హిందువులను మహ్మదీయులలో కలుపుటకు గాను మరి యొక ఉపనిషత్తును వ్రాసి అల్లో పనిషత్తని పేరు పెట్టిరి.


ఎంతమిత! ఈ యుపనిషత్తుల కంటకారణ్యమునే నిదివరలో ఎఱుగను. పదునెకండు ఉపనిషత్తులు మాత్రమే నే నెఱుగుదును. వీని సహాయమువల్ల బాహ్నధర్మ ప్రచారము చేయనారంభిచితిని. ఈ యుపనిషత్తులనే బాహ్మధర్మమునకు పునాదిగా చేసితిని. కాని యీ పునాదికూడ ఇసుకవలయము, శిఫలము అనియు, ఇచ్చటకూడ గట్టి నేల లేదనియు ఇప్పుడు కనుగొంటిని.. మొట్ట మొదట వేదముల చెంత చేరితిని. కాని 'బాహ్మధర్మపు పునాది నచట స్థాపన చేయలేక పోతిని. పిమ్మట ప్రమాణములగు ఏకాదశ ఉపనిషత్తుల వద్దకు వచ్చితిని. కాని అది యేమి దురదృష్టమోకాని అచట కూడ పునాది నిర్మిప లేక పోతిని. ఈశ్వరునకును మనకును ఉపాస్య ఉపాసకుల సంబంధము అనునదియే బ్రహ్మధర్మము యొక్క ప్రాణము. శంకరాచార్యుని వేదాంతదర్శనము యొక్క శారీరక మీమాంసలో దీని విపరీత సిద్ధాంతముచూచినప్పటి కుండియు వానిలో ఇంక నమ్మకముంచ లేక పోతిమి. మాధర్మపోషణ మునకు దాని నంగీకరించ లేక పోతిమి. వేదాంతదర్శనమును విసర్జించి కాదళ ఉపనిషత్తులను మాత్ర మంగీకరించినచో బాహ్మధర్మమునకు పోషణ బడయవచ్చునని కనుగొంటిని. కావున తక్కినవన్నియు వదలి