పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

108

ముహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్రము,



యుండెను. భోజనమువద్ద నాకు అరువదిరకముల పదార్ధములు వడ్డింపబడెను. నేనాయస భవనమునందే నిద్రించితిని. ఇంకను చాలప్రొద్దుండగనే రాజే స్వయముగ వచ్చి నన్ను లేపి అతని పూజాగృహము నాకు జూపి ప్రభాత వేళ నన్ను సాగనంపెను.


ఆ కాలమునందీరీతిగ ధర్మసంబంధమున నీ యిరువురు రాజుల తో బంధింపబడి యుంటిని, వీరిరువురిలో నొకరు నన్ను బాహాట ముగా స్వీకరించెను. రెండవవారు మిక్కిలి గోప్యముగ నయినను విశేష ఆంతర్యముతో స్వీకరిం చెను.

ఇరువది రెండవప్రకరణము


అన్నియు పదునొకండు ఉపనిషత్తులు కలవనియు, వాని భాష్య ములు శంకరాచార్యులు వారు వ్రాసిరనియు పూర్వము నేనభిప్రాయ పడితిని. శంకరాచార్యులు భాష్యము వ్రాయని యుపనిషత్తు లనేకములు గలవని యిప్పుడు తెలిసికొంటిని. అన్వేషింపగా 147 ఉపనిషత్తులున్నట్లు తేలెను. శంకరాచార్యులు భాష్యము వ్రాసిన ఆ పాచీనో"పనిషత్తు లే యన్నిటిలో ప్రామాణ్యములు. వానిలోనే బాహ్మజ్ఞాన బ్రహ్మోపాసనలగూర్చియు, ముక్తిసోపానములను గూర్చియు బోధింపబడి యుండెను. సకల శాస్త్రములలో ఈయుపనిషత్తులు వేదము యొక్కశిరోభాగములు, సర్వ శ్రేష్ఠములుగను పరిగణింపబడి నప్పుడు వైష్ణవ శైవ సాంప్రదాయకులు ఉపనిషత్తుల పేరు పెట్టి గ్రంధ ప్రచారము చేయ నారంభించిరి. ఆగ్రంధముతో పరమాత్మకు నూరు వారివారి దేవతల యుపాసన ప్రచారము చేయ నారంభించిరి. అప్పుడే గోపాలతాపనీ ఉపనిషత్తు వ్రాయబడెను. దానిలో పరమేశ్వరుని స్థానమున