పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువది యొక టవ ప్రకరణము.

107



ఇదియే మాప్రథమసమా వేశము. ఈయన తనంత తానే నాతోవచ్చి పరిచయము చేసికొనెను. కృష్ణ నగరములో నొక బాహ్మసమాజము స్థాపించి నేనచ్చటికి తరుచు పోవుచుంటిని. లోకుల ద్వారా సంగతి వినుచుండుట వల్లను, నాయుపన్యాసములు చదివియుండుటవల్లను నాతో మాట్లాడవలెనని ఆయన కుతూహల పడెను. సందర్శించుటకొక సాయం కాలము నేనాతనిబసకు వెళ్ళితిని, సన్నతడు తన మేడమీదికి తీసికొని వెళ్లెను. అచ్చట నింనింకెవ్వరును లేరు. అచ్చట నొక దీపమైనను లేదు. వెంటనే యాతడు క్రింద కూర్చుండెను. నేనును అట్లే చేసితిని. ఇద్దరము ఫకీర్ల వలె నిర్విచారముగా నుంటిమి. అతడు “ ఏకో దేవః సర్వభూతేషుగూశః | సర్వవ్యాపీ సర్వభూతాంత రాత్మా! కర్మాధ్యక్షః సర్వభూతాధివాసః సాక్ష్మీ చేతా కేవలో నిర్గుణశ్చ ” అనెను.


అతని అమాయకత్వము సరళభావము చూచి ఆయన యెడలనాకు విశేష సద్భావము జనియించెను. మేము ఏకహృదయువులయిపోతిమి.నేనతని వీడ్కొని పోవునపుడు

"ఇంకొక సారి మీరు కృష్ణనగరమునకు వచ్చినపుడు మాయింట నొక రాత్రి యుండవలెను. ఉండెదరుగదా!” అనెను. " అంతకన్న ఆహ్లాదము, సౌభాగ్యము 

ఇంకేమి యుండును. నన్ను మీరెప్పుడు పిలచిన అప్పుడు వచ్చెదను అంటిని.


పిమ్మటనే సెకసారి కృష్ణ నగరమునకు పోయినప్పుడు నన్నత డాహ్వానము చేసెను. సంధ్యా సమయమున నేనా రాజభవనమునకు బోతిని. నన్ను నిభృతమగు, సుందరమగు ఒక గదిలోనికి గొనిపోయి కూర్చుండ బెట్టెను. అతని కుమారుడగు సతీశ్చందుడు తక్క వేరెవ్వ రును అచ్చట లేరు. మమ్మామోద పెట్టుటకొర కాతడొక కృతి పాడి వినిపించెను. రాత్రి రెండు జాములవరకును ఆ సంగీతము జరుగుచునే