పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

106

మహర్షి దేవేంద్రనాధ ఠాకూర్ స్వీయచరిత్రము,




నాపఠము వాసెను. నేనప్పుడు కూర్చుండినట్లు వాయబడిన ఆపఠ మిప్పటికి నాతని గదిలో నున్నది. రాజమహతాబ్ చందుడు స్వర్గ స్థుడా'యెను. అతని కుమారుడు అబ్ తాబ్ చంద్రుడును అల్ప వయస్సు నందే ఇహలోక జీవనము చాలించెను. కాని యాతని బ్రాహ్మసమా జముమాత్రమింకను యున్నది. నేటికి నొక ఉపాచార్యుడు నియమిత కాలము లందు బ్రహ్మనామము నచ్చట ధ్వనింప చేయుచుండును; గాని వినువారుమాత్ర మెవ్వరును లేరు. ఆశూన్య సమాజ గృహము యొక్క అధిష్ఠాతృదేవతమాత్రమే దానిద్వీపము.


కలకత్తాలో ఒక నాడు నేను బండి దిగి షికారు వెళ్లుచుండ మా ర్గమునందు నాకొక యుత్తర మియ్యబడెను. తరచిచూడగా నది కృష్ణ నగరాధిపుడగు 'రాజా శిరీష్ చంద్రుని వద్దనుండియని తెలిసికొంటిని. "పురమందిరమున రేపు సాయంకాలము అయిదుగంటలకు నన్ను కలసి కొనగలుగుదు రేని అమితానందము నొందువాడను,” అని 'వాసెను. మరునాడయిదుగంటలకు నేను పురమందిరమునకు పోతిని. ఆయన కొరక పేక్షించుచుంటిని. మరికొంచెము సేపునకు రాజు వచ్చి దర్శ నమిచ్చెను. పరస్పర సమ్మేళనముత విశేషానందము నొందితిమి. అక్కడ నాతో నాయన కేవలము ధర్మాలోచనయే గావించెను. వెళ్ళునప్పుడతడు నాతో,ఇక్కడ కొలది నిమిషములుమాత్రమే మీతో మాట్లాడగలుగుటచే నామనసున కెంతమాత్రము సంతుష్టి గాలేదు. నేనింకను కలకత్తాలో మూడునాలుగు దినములుండెదను, ఈలోగా ఎప్పుడైన ఒక సాయంకాలము నాబసకు దయచేసి సంభా షింప గలిగినచో మిక్కిలి సంతసింపగలవాడను, ” అనెను. నలుగురిలో నన్ను కలసికొనుట ఆతనికి కొంచము సంకోచముగా నుండెను. 'నేను జాహ్మ సమాజ నేతను; అతడన్ననో నవద్వీసాధిపతి; విగ్రహారాధ కుల ప్రభువు