పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

iii


భాషాంతరీకరణమును సాధ్యమైనంతవరకు బంగాళీ గ్రంధమునకు సరిగా నుండునట్లు జేసితిని. వీలుపడినంతవరకు మహర్షి వాక్యములనే ప్రయోగించితిని. కావున ఇందలి శైలి సామాన్యరచనకు కటువుగను, అచ్చటచ్చట వెగటుగను కూడ తోచవచ్చును. వ్యాకరణము నందు ప్రవేశమించుకయు నాకు లేదు. వ్యాకరణ దోషములను, తప్పుడు సమాసములను సవరించుట కేపండితుల సహాయ్యమును నేను కోర లేదు. ముద్రాలయము కాకినాడయందును, నాయునికి రాజుమహేందవరమందును అగుటచే అచ్చు ప్రతులను విశేషశ్రద్దతో సరిచూచుట కవకాశము లేకుండెను.

విశేషముశ్రమనంది వాతప్రతులను, అచ్చుప్రతులను సరిచూచి, అత్యంత ఉత్సాహముతో గ్రంధ ప్రచురణమందు తోడ్పడి, గ్రంధమునకు ప్రాణముపోసి రూపము తెచ్చిన నామిత్రుడు శ్రీయుత గాడేపల్లి సూర్యప్రకాశ రావు ఎం.ఏ., ఎల్.టి., గారికి నా హృదయ పూర్వక వందనము లర్పించుచున్నాడను. గంధమునందలి తప్పులు నావిగను, ఒప్పులాయనవిగను పొఠకులు గ్రహింతురుగాక.

గంధమును ముద్రించుటకు నాకు ధన సహాయము జేసిన మిత్రులందరకును కృతజ్ఞుడను. శ్రీయుత దర్భా శివరామరాస్ బి.యె., బి. యల్, గారును, శ్రీయుత పి. బసవరాజు బి. యే. బి.యల్ . గారును, చెరి యొక ఏబదిరూపాయలనిచ్చి నాకత్యంత సహాయ మొనర్చి నందుకు వారికి శాశ్వత కృతజ్ఞుడను.

గ్రంధమును నామనసువచ్చినరీతిని అచిర కాలముననే ముద్రించి యిచ్చిన Scape & Co., వారికిని వందనములు.

రాజమండ్రి, , 29-9-1922.

మొక్కపాటి రామమూర్తి.