పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

94

మహర్షి దేవేంద్ర నాథశాకూర్ స్వీయచరిత్రము,


లైరి. ఈ సమయమందు వారికింత దయ ఎక్కడనుండి వచ్చెను? నాచిరజీవన సఖుడే వారి హృదయములలో దయ ప్రేరణ చేసెను. మాయావదా స్తియు వారి చేతిలో నుంచితిమి, గాన మాపోషణార్ధమై మాకీయాస్తి నుండి సంవత్సరమునకు 25,000 రూపాయల నిచ్చెద మనిరి. ఇట్లు బాకీ దార్లకును అప్పులవాండ్రకును ఒక విధమగు సద్భావ ముదయించెను. అప్పు విషయమై ఎవ్వరును న్యాయవాదమునకు దిగ లేదు. మా ఆస్తినంతయు వారి హస్తములలో నుంచుకొని దానిని సరిచూచుటకు వారిలో ముఖ్యులకతో " నొక కమిటీ నేర్పరిచిరి. వెయ్యి రూపాయల జీతముతో నొక కార్యదర్శి నియమింపబడెను. అతని కింద కొందరు సహా యోద్యోగుల నేర్పరచిరి. "Carr, Tagore & Co in Liquidation అను పేరు వ్యవహారము జరుపుచుండిరి.


మా ఆస్తి మీద అప్పుగాండ్రు, కర్తృత్వము సాపించిన పిమ్మట సభముగిసెను. మేమిరువురు సోదరులము ఇంటికి బయలు దేరితిమి. దారిలో గిరీంద్రునితో నిట్లంటిని. “మనము ఇప్పుడొక విశ్వజిత్యజ్ఞము చేసితిమి. మనకున్న దంతయు నిచ్చి వేసితిమి. "“ఔనౌను. మనకొర కేమియు మనముంచు కొనలేదని అందరు నెఱుగుదురు గాక. వారికున్న దంతయు ఇచ్చి వేసిరే ' యని చెప్పుదురుగాక. సర్వ వేద సంపదౌ ” అని అతడనెను. “జనులట్లనిన మాత్రమేమి ప్రయోజనము? న్యాయసభలు వారి మాటలు వినవు. మన మీద నెవ రైనదావా తెచ్చిన యెడల మనకున్న దంతయు నిచ్చి వేసితిమని మనము ప్రమాణము చెయ్యవలెను. లేనిచో న్యాయశాసనము మన లను వదలదు. కాని మనకొక గుడ్డపీలిక యున్నను మనము రాజు ద్వారమున నిలబడి మనకున్న దంతయు నిచ్చితిమని మనము ప్రమాణము చెయ్య జాలముగ దా ! మనకున్న దంతయు మాతమిచ్చి వేయ వచ్చును గాని ఇట్లు ప్రమాణము చెయ్య రాదు. పర మేశ్వరుడు మన



.