పుట:Maharshhi-Deiveindranaadha-Tagore-Sviiyacharitra.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పందొమ్మిదవ ప్రకరణము.

93


"Trust" ఆస్తి కొంతకలదు. దీనినిమాత్రము మిరుముట్టుకొనుటకు వలనుపడదు.

ఈరీతిగా గార్డను సభ వారితో ముచ్చటించు చుండగ నేను గిరింద్ర నాధునితో " మన ‘ వీలు ' ఆస్తిని ముట్టుకొన రాదని అప్పుల వాండ్రతో గార్డను చెప్పుచున్నాడు. మన అప్పులు తీర్చు కొనుటకు దీని నమ్ముటకు మనకు హక్కు లేక పోయినను ప్రస్తుతము మన బాకీలను తీర్చుటకు దీనిని కూడ ఇచ్చి వేయ సంసిద్ధులమై యున్నామని మనము చెప్పవలదా? మన పూర్వులు అప్పుల నుండి వెంటనే విముక్తులగుటకు ఏమిచేసిన బాగుండునో ఆపథము నవలంబించుట శ్రేయస్కరము. ఈ ఋణము మన స్వంత ఆస్తి. ఈ తీరనియెడల మన 'వీలు ' ఆస్తినికూడ అమ్మి వేయవలసినదే.”.


ఆ స్తిలోని కొంత భాగము మీద చెయ్యి వెయ్య రాదని వినుట తోడనే అప్పుల వాండ్ర సంతుష్టిని తెలుపుచుండిరి. కాని యిచ్ఛాను సారముగ ఏవిధమగు నిర్బంధము లేక, కోర్టులో ఏవిధమగు సూత్రము చేతను ఇబ్బంది పెట్టబడకయే 'వీలు ' సొత్తు సహా యావదా స్తియువారి చేతులలో నుంచుటకు సంసిరులై యున్నామన్న సంగతి ఉత్తరక్షణమందే విని వారందరును స్తంభితు లైరి. మేనిట్లు చెప్పిన తోడనే సహృదయు లనేకులు, మహా జనుల నేకమంది చక్షువుల నుండి అశ్రువులు కార్చిరి. మాకాసన్నమైన విపత్తును చూచి వారును విషణ్ణులైరి" కంపెనీ ' యొక్క ఔన్నత్యమునకు గాని పతనమునకు గాని మేము కారకులము కామన్న సంగతియు, మేము నీర్దోషులమనియు వారు గ్రహించిరి. ఈ అల్పవయస్సులోనే ఈ దారుణ విపత్తు మామస్తకములపై పడినది. 'రేపిందులో నోక్క పైసయైనను మాకు మిగలదు. ఇది తలంచియే వారు దయార్ద్ర హృదయు లైరి.వారికి నష్టము సంభవించినదని క్రోధము చెందుటకు బదులు వారు దయార్ద్ర హృదయువారు