పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/94

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

వివేకానందస్వామి

75

డామహాపురుషుని దర్శించుటకుఁ బోయెను. వేదాంతవిద్యాభిమానులగు నాపండితు లిరువురు నొండొరుల గౌగలించుకొని హిందూదేశమును గూర్చి చాలాసేపు ముచ్చటించి యొకదినము సంతోషమున గడపిరి. వివేకానందుఁడు మాక్సుముల్లర్ పండితునితో గలసి యాతనియింటనున్నపుడు మహర్షితో గలసి యొకయాశ్రమమున నున్నట్టె యున్నదని చెప్పెను. వివేకానందస్వామి యింగ్లాండులో నున్నపుడు తద్దేశస్థులు వాని యుపన్యాసములను మిక్కిలి శ్రద్ధతోను గౌరవముతోను వినిరి. వివేకానందస్వామికి సంఘసంస్కారమునం దిష్టము లేదనియు హిందువులందఱు పూర్వాచారప్రకారము తప్పక నడచుకొనవలసినదని యాయన యభిప్రాయ మనియుఁ గొందఱు చెప్పుచున్నారు. కాని వారి మాటలు సరికావు.

వివేకానందస్వామి తానుస్వల్పసంస్కారముల జేయువాడను కాననయు సంస్కర్తలకంటె నెక్కువసంస్కర్తననియు గొన్నికొన్ని యుపన్యాసములలో జెప్పెను. ఆయన చరిత్రమును జక్కగాపరీక్షించిన వారికి మొదటినుండియు నాయనసంస్కర్తయేయని తోఁచకమానదు. కలియుగమందు సన్యాసము బ్రాహ్మణులకే నిషిద్ధమని యున్నది. అట్లుండగా తాను బ్రాహ్మణేతరుఁడయ్యు వివేకానందస్వామి సన్యసించుటయే యొక సంస్కారము. అట్లుసన్యసించి సన్యాసి ధర్మముల నెఱపుచు కర్మభూమియగు భరతఖండమునందుండక మహాసముద్రము దాఁటి నౌకాయాత్రలు చేసి కర్మబాహ్యమునగు మ్లేచ్ఛదేశములకుఁ బోయి జాతిమత భేదములులేని క్రైస్తవులతోఁ గలసి మెలసి చిరకాలమునుండి వారిఇండ్ల భోజనములుచేసి మనవారి యభిప్రాయ ప్రకారముగ బ్రాహ్మణులకొక్కరికే యుపదేశింపఁబడఁదగిన వైదిక ధర్మములను బ్రహ్మవిద్యను ననార్యులగు