పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వివేకానందస్వామి

ఆసేతు హిమాచలమగు భరతఖండమునందంతటకీర్తి వ్యాపించియున్న నీమహాత్ముని చరిత్ర మెక్కడ మాకు సమగ్రముగాలభింపలేదు. అందుచేతనీతని చరిత్రము సంగ్రహముగా వ్రాయవలసివచ్చినది.

ఈయన బంగాళాదేశస్థుఁడగు శూద్రుఁడని కొందఱు క్షత్రియుఁడని కొందఱు జెప్పుచున్నారు. పూర్వాశ్రమమునం దీయన పేరు నరేంద్రనాధదత్తు. సన్యసించిన వెనుక నీయన వివేకానందస్వామియని పేరుపెట్టుకొనెను. నరేంద్రనాధదత్తుయొక్క తల్లిదండ్రు లెవ్వరో వారెట్టివారో యీతనిబాల్య మేవిధముగా గడుపబడినదో మనము తెలిసికొనుటకు దగినయాధారము లేవియు లభింప లేదు. కాని యీతనితండ్రి కలకత్తానగరవాసుఁడే యనియు నరేంద్రనాధదత్తు తత్పట్టణమునందే పుట్టి పెరిగి యింగ్లీషువిద్య చదువుకొని తుదకు పట్టపరీక్ష యందనగా బి. యే. పరీక్షయందుఁ గృతార్థుఁడయ్యెనని కొన్ని గ్రంథములం జదివినారము. ఈయన ప్రధమమందు బ్రహ్మసమాజ మతాచార్యుఁడగు కేశవచంద్రసేనునితోఁ గలసి యామతాభిమానముగలిగి యుండెనఁట. అనంతరము శ్రీరామకృష్ణ పరమహంసయొక్క మహిమలు విని యతనిశిష్యుఁడై నరేంద్రనాధదత్తు వానియనుగ్రహము వలన వేదాంతవిద్యోపదేశమునొంది బ్రహ్మజ్ఞానసంపన్నుఁడై గురువు గారి మరణానంతరమున లౌకికవ్యాపారములపై విరక్తిపొడమ సన్యసించి వివేకానందస్వామి యనుపేరం బ్రసిద్ధుఁడై తన జీవిత శేషమంతయు లోకోపకారార్థమై గడపియుపనిషన్మతమును భరతఖండమునందే గాక యమెరికా ఖండమునందును యూరపు ఖండమునందును బోధించెను. ఈయన సన్యసింపక మునుపును సన్యసించిన వెనుక కొంత కాలమును మన దేశమందేయున్నను వానిపే రెవ్వరికిం దెలియ