పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/72

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
55
రామకృష్ణపరమహంసహరణల లిచ్చుచున్నాము, అతఁడుపూర్వము 'దేరీ'యను గ్రామమునఁ గాపురముండువాఁడు ఆయూరి జమీందారుఁ డొకవిషయమునఁ దప్పుసాక్ష్యమిమ్మనియు నీయకుండిన వానిం చిక్కులఁబెట్టెద ననియు బెదరించినందున నతఁ డబద్ధమాడజాలక యాయూరు విడిచి కమర్పకారునకు వచ్చి తనజీవిత శేష మచ్చటనే గడెపెను. ఒకనాఁడతడు తనకూతుంజూచుటకు బయనమయి పోవుచుండగా మార్గమధ్యమున నప్పుడే క్రొత్తగా బయలుదేరిన దళములుగల యొకమారేడు చెట్టు గనఁబడెను. మారేడుదళములతో శివపూజసేయుట యతనికి మిక్కిలి ప్రియమగుటచేఁ బ్రయాణ మింకొకయప్పుడు సేయవచ్చును. ఈయదను దప్పిన బిల్వదళములు మఱియొకప్పుడు దొరకునా యని పయనమును గట్టిపెట్టి చెట్టెక్కి మారేడు దళములఁగోసి యొడినిండ వేసికొని వెనుకకుం జని యిల్లుచేరి మనసార శివపూజఁ జేసెను. అతనివద్ద వాక్సుద్ధి గలదనియు శుభముకాని యశుభముగాని యతఁ డన్నట్లు జరుగుననియు జనులు నమ్మిరి. చటోపాధ్యాయుఁడు యాత్ర నిమిత్తము గయకు బోయి యుండ నందు గదాధరుఁడగు శ్రీమహావిష్ణు వతనికిఁ గలలోఁ గనఁబడి వానికడుపునగొడుకయి పుట్టుదునని చెప్పెనట. అందుచే నతనికిఁ దండ్రి గదాధరుఁడను పేరుపెట్టెను. కాని యిటీవల నెందుచేతనో యతఁడు రామకృష్ణుఁ డనుపేరంబరగె

రామకృష్ణుఁ డాఱవయేటఁనే పురాణములుచెప్పెడివారియొద్దకుఁబోయి భారతభాగవత రామాయణాది కథల నెఱింగెను. ఆతని కంఠధ్వని మధురమయి గంభీరమైనది. గానమునం దించుకప్రవేశము గలుగుటచే నతఁడు శ్రావ్యముగఁబాడ గలవాడట. దేవాలయముల యందలి విగ్రహములు చక్కగాఁజెక్కఁబడినవో లేవో తెలిసికొనుట కతనికి సహజనైపుణ్యము గలదఁట. అతఁడు ఒక బాలుఁడయినను గ్రామమునందలి పెద్దలు చుట్టుపట్టవాండ్రు దేవతావిగ్రహముల