పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/63

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
48
మహాపురుషుల జీవితములుటకు గ్రంథముల వ్రాసి తక్కువ వెలకు వానినమ్ముట. 2. తగిన వారికి దానము చేయుట. 3 స్త్రీల యభివృద్ధికయి పాటుపడుట. 4. దేశమునందంతట విద్య వ్యాపింపఁ జేయుట 5 మద్యపానాది దురాచారములు దేశమునఁ బ్రబలకుండునట్లు పనిచేయుట. ధన హీనులకుఁ దక్కువవెలకుఁ బత్రిక లందజేయవలయునను తలంపుతో సులభ సమాచార మనుపేర వారమునకొకసారి పైస చందాతోఁ బత్రికనొకటి ప్రకటింపఁజొచ్చెను. స్త్రీలకొక బోధనాభ్యసన పాఠశాల (నార్మల్‌స్కూలు) స్థాపించి యతఁడు స్త్రీవిద్యాభివృద్ధిఁ గాసించెను. కొంతకాలము గడచిన పిదప 'భామాహితార్థినీ సభ' యొకటి స్థాపింపఁబడి దీనితోఁ జేర్పఁబడెను. ఇదిగాక చేతిపనులు మొదలగు నవి నేర్పి యనేకులకు మంచివృత్తులు కల్పించుట కొక పాఠశాలను గూడ నీయన స్థాపించెను.

దేశమునందున్న బ్రహ్మమతావలంబుల నందఱ నొక్క దారిని దెచ్చుటకయి ప్రయత్నించి 1874 వ సంవత్సరమున భరతాశ్రమమును స్థాపించెను. కేశవచంద్రుఁ డిందునిమిత్తము పెద్ద దొడ్డియుఁ దోఁటయు గల యిల్లుకొని యితరపట్టణములనుండి బ్రహ్మమతస్థుల భార్యలు బిడ్డలు వచ్చి యచ్చటనే భుజియించుచు విద్య నేర్చుకొనుటకుఁ దగిన యేర్పాటులఁ జేసెను. ఆసంవత్సరమునందే మార్చి నెలలో గవర్నరు జనరలుగారు బ్రహ్మమతస్థుల వివాహములనుగూర్చి కేశవచంద్రుని యభిప్రాయప్రకార మొక శాసనము నిర్మించెను. భరత ఖండమున సంస్కర్తగాఁ దాను చేసిన కృషికి ఫలము నేటికి గలిగినదని యా శాసనము నిర్మింపఁ బడినపు డతఁడు సంతోషించెను.

1875 వ సంవత్సరము మొదలు 1878 వ సంవత్సరమువఱకు నతఁడు బ్రహ్మసమాజ మతమును దగినస్థితిలో నుంచుటలో పరిశ్రమఁ జేసెను. అది మొద లతఁడు తనమతస్థులకు వై రాగ్యమును బోధించి