పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/49

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
36
మహాపురుషుల జీవితములువర్తనము చేమహర్షి బిరుదము నందెను. ఈరాజయోగి బ్రహ్మసమాజ మతస్థుఁడయినను వాని నిమిత్తమన్ని తెగలవారు నన్ని మతములవారు దుఃఖించిరి.

మరణానంతరమున వీనిని గౌరవించుటకు శవము వెంటఁ గాలి నడకను వెళ్ళిన వారిమాట యటుండఁగ గొప్పవా రెక్కిపోయిన బండ్లొక మైలుదూరమువఱకు వ్యాపించియుండెను. ఆమహాత్ముని శరీరమును గంగాతీరమున మంచిగంధపు చెక్కలతో దహనముఁ జేసిరి. ఈరాజయోగి చరిత్రముఁ జదివినప్పుడు సంసారముఁ జేయుచు దారపుత్రాదులతో సుఖించుచు నాత్మసన్యాసముఁ బుచ్చుకొని ముక్తులయిన వశిష్ఠాది మహర్షుల చరిత్రమును జనకాది రాజయోగుల చరిత్రమును జ్ఞప్తికివచ్చును.