పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/48

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
35
మహర్షి దేవేంద్రనాథటాగూరువలనను నిర్మలాంతఃకరణమువలనను భూతదయాపరతవలనను ప్రజలచే మహర్షి యను బిరుదమునొంది యాబిరుదమునకుఁ దగినవాఁడనిపించు కొనియెను. ఏటేట బ్రహ్మసమాజ సాంవత్సరికోత్సవముఁ జరిగెడు దినముల దక్క మరియెన్నఁడు నాతఁడు జనుల కగపడెడువాఁడు కాఁడఁట. మిక్కిలి ముదిమిలో సయితము నాతనికి బాల్యమున నున్నంత జ్ఞాపకశక్తి యుండెనఁట. పుణ్య క్షేత్రములలో దేవదర్శనము చేయుటకుఁ బోయినట్లే యీమహర్షిని హిందువు లనేకులు దర్శింప వచ్చెడివారు. ఈయన హిందూదేశమునందలి మనేక భాగములనే గాక బర్మా సింహళము, చీనా మొదలగు విదేశముల సయితము చూచెను.

ఈయనకు మరణకాలము నాటికి పలువురు కుమారులు నిరువురు కుమార్తెలు నుండిరి. అందు జ్యేష్ఠకుమారుఁడగు ద్విజేంద్రనాథు టాగూరు పండితుఁడై కొన్ని వేదాంత గ్రంథములు రచించెను. రెండవకుమారుఁడు సత్యేంథ్ర టాగూరు గొప్పయుద్యోగములఁ జేసి కొన్ని యేండ్ల క్రిందట పించను పుచ్చుకొనెను. మూడవకుమారుఁడగు జ్యోతీంద్రనాథ టాగూరును నాల్గవతనయుఁడగు రవీంద్రనాథ టాగూరును బంగాళీభాషలో మంచి మంచి గ్రంథములు వ్రాసిరి. ఈనాటి బంగాళీ కవులలో రవీంద్రనాథుఁడే మిక్కిలి గొప్పవాఁడని ప్రసిద్ధిగలదు. కుమార్తెయగు శ్రీమతి స్వర్ణకుమారి దేవియు ననేక చిత్రవచన కావ్యముల వ్రాసి ప్రసిద్ధికెక్కి యిప్పుడు బంగాళ దేశమున సివిలు సర్వీసులో గొప్ప యుద్యోగములుచేయు ఘోషాలుగారికి తల్లి యయ్యెను. ఈమహర్షి 1905 వ సంవత్సరమున జనవరినెల 19 వ తేది గురువారము మధ్యాహ్నము లోకాంతర గతుఁడయ్యెను. ఈ మహాత్ముఁడెంత జబ్బుగనున్నను భగవత్ప్రార్థనము మాని యెఱుఁగఁడు. ఇతఁడు మహారాజు బిరుదమునందుటకు మారు తన సత్ప్ర