పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/455

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
388
మహాపురుషుల జీవితములుకధికారమీయ వలసినదనియు దొరతనమువారిని మొట్టమొదట నడిగిన ధైర్యశాలి యితడే. ఇవి యన్నియు గ్రమక్రమమున మన దేశస్థులకు లభించినవికాని యీయన మరణానంతరమందు ననగా నీయన యడిగిన చాలాకాలమునకు లభించినవి. తిరువాన్కూరులో నున్నప్పుడీయన "పరలోకమే మన మనోరథము" అను నర్థము వచ్చునట్టి యింగ్లీషు మాటలను బంగారపు టక్షరములలో నొక్కొక్కయక్షర మొక్కొక్క బొమ్మగా నుండునట్లచ్చు వేయించి ప్రతి దినమది తన కగపడునట్లు గృహమునఁ గట్టుకొనియెను.

శ్రీ కొండపల్లి ముద్రాశాల, రాజమండ్రి.