పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/454

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
387
వెంబాకం రామయ్యంగారుగాని వ్రాతయందుగాని యతిశయోక్తి గర్హించుచుండెను. రామయ్యంగారు మితభాషి. ఏ సంగతినిగాని జరిగిన యధార్థమంతయు దెలిసికొనక ముందతడు నమ్మువాడుకాడు. ఈ సంగతి యాయన జాబులు చూచినవారికి దెలియును. ఆయనకు స్వభావముచేతనే కొన్ని విషయములం దిష్టము కొన్ని విషయములయం దనిష్టము గలుగుచు వచ్చెను. కాని తన తప్పులను తనకు సహేతుకముగ నెవరయిన నెఱిగించిన నవియొప్పుకొని తన నడత దిద్దుకొనుచు వచ్చెను. అతడు తాబేదారులవద్దనుండి కఠినముగ బనిబుచ్చుకొనునట్టి యజమానుడు. తన పై యధికారులవద్ద తానుకూడ నట్లే పనిచేసెను. వ్యవహారములలో గఠినుఁడగుటచేత నతని యాప్తులైనవారే యనేకులు తమ్మతడు గౌరవభంగము చేసెనని విచారించుచు వచ్చిరి. అతఁడు ప్రాచీన పద్ధతుల యందభిమతము గలవాడైనను నూతన పద్ధతులమీద మార్పులను మెల్లఁగా జేయ నిచ్చగలవాడు. తన యిల్లు యూరోపియనుల గృహముల విధమున నుంచుకొని తన యాఁడువాండ్రకు నింగ్లీషు సంగీతము జెప్పించి యింగ్లీషు వారిని తనయింటికి విందునకుఁ బిలిచి వారితో నెక్కువమైత్రి నడపిన స్వదేశస్థులలో నితడే మొట్టమొదటివాడు. యూరోపియనులకు స్వదేశస్థులకు సాంఘిక సంబంధములను వృద్ధిజేయుట కప్పటి గవర్నరుగారగు నేపియరు ప్రభువు కాస్మాపాలిటను క్లబ్బనుపేర నొకసభ స్థాపింపుమని చెప్ప నట్టిసభ స్థాపించినయతఁడితడే. దానికి మొదటి కార్యదర్శి యితఁడే. గవర్నరుగారి శాసన నిర్మాణసభలో స్వదేశ సభికుల నెక్కువమందిని చేర్చవలసినదనియు బడ్జటు విషయమయిన చర్చ జరిగించుటకు యవసరమయినప్పుడు గవర్నమెంటువారిని ప్రశ్నలడుగుటకు సభికుల