పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/452

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

[49]

వెంబాకం రామయ్యంగారు

385



వాడుక యుండెను. పన్ను లిచ్చుకొనలేని పేదజనులు కొన్ని వస్తువులను సర్కారున కుచితముగాఁగాని లేక మిక్కిలి స్వల్పధరకుఁగాని తెచ్చి యిచ్చుచుండవలెను. అట్టివాడుక యుండకూడదని దాని నితఁడు నిర్మూలించెను. ఆదేశమునందలి చేతిపనులను విశేషముగ వృద్ధిచేసి నూతన వస్తు నిర్మాణయంత్రములను పెట్టించెను. ఇందు ముఖ్యమయినవి పంచదారచేయు యంత్రము. కాగితములుచేయు యంత్రము, దూదియంత్రము. వెండియు నతఁడు స్టాంపుచట్టము నొకటి నిర్మించి కాఫీగింజలు పండెడు నేలలకు పన్నులు కొట్టివేసి చిల్లరసరకులమీద నెగుమతి పన్నులు తీసివేసి భూమిలో పండిన వస్తువుల నేఁటేఁట ప్రదర్శనములు పెట్టించి జనులకుఁజూపి కృషి నభివృద్ధిఁజేసి జనులుపెట్టుకొన్న చిన్న పాఠశాలలకు నేటేటఁ గొంత ధనసహాయమిచ్చి విద్యాభివృద్ధి జేయుచు నార్మలు పాఠాశాలలు స్థాపించుచు నల్ల మందుమీద దిగుమతిపన్నుఁ గొట్టివేసి తిరువాన్కూరులోనున్న జలాధారములను వృద్ధిబఱచి శాశ్వతమయిన యుపకారముఁ జేసెను. వేయేల ? సంస్థానమందతడు బాగుచేయని డిపార్టుమెంటొకటియు లేదు. ఆతని ప్రజ్ఞ యేమోకాని యాతడు సంస్థానపు సొమ్ము ఖర్చు పెట్టి చేయించిన పనులలో నొకటియుసొమ్ము దండుగ యగునట్లు నిష్ఫలము కాలేదు. అట్లు తానుచేసిన యనేక సంస్కారములచేత సంస్థానమంతయు రత్న గర్భమయి ధనముతో దులదూగుచున్నందున దన కార్యముల ఫలితములం జూచుచు జిరకాలము సంస్థానమునందు బనిజేయవలయునని రామయ్యంగారు తలంచిరి. కాని యట్లు చేయుటకు వీలుపడదయ్యె.