పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/451

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
384
మహాపురుషుల జీవితములులేకపోవుటయను రెండుదోషములు పట్టియుండుటచే రామయ్యంగారుద్యోగస్థుల సంఖ్య తగ్గించిజీతములు వృద్ధిఁ జేసియాడిపార్టుమెంటు నంతను స్థిరమయిన పునాదిమీఁదఁబెట్టెను. ఉప్పుకొఠారులమీఁదఁ దగినంత యదపు గలుగునట్లా డిపార్టుమెంటునంతను మంచి స్థితిలోనికి దెచ్చెను. వీని యన్నిటికంటె శ్లాఘనీయమైన కార్యమేమనఁగా రామయ్యంగారు తిరువాన్కూరు సంస్థానమంతయుఁ గొలిపించి భూములయొక్క శిస్తు స్థిరపరచెను. అనఁగా సర్వే సెటిలుమెంటును జేయించెను. ఈసర్వే లేకపోవుట సంస్థానమునకు మిక్కిలి నష్టకరముగా నుండెననియు నదిచేయించుటచే జాల లాభములు కలుఁగుననియు నయ్యంగారి తరువాత వచ్చిన మంత్రులు గూడ నొప్పుకొనిరి. వెనుకటి నేలకొలతలు రివిన్యూలెక్కలు సరిగా నుండనందున వ్యవహారము చక్కగా జరుపుట యవశ్యమయ్యెను. అందుచేత రామయ్యంగారా కొఱత నివారించుటకు సమగ్రముగా నేల సర్వే చేయించుటయే యుత్తమ సాధనమని తగువిధమున నట్లు చేయించెను. ఈసర్వే సెటిలుమెంటులు నేలయొక్క పరిమితిని సారమును నిరూపించెను. శిస్తు వృద్ధిజేసెను. ఖజానా ధనముతో నింపెను. భూమి విషయమయి వివాదములు వచ్చినప్పుడు వెనుక నెట్లున్నదో చూచుకోవలయునన్న తగిన యాధారములుగ నేర్పడెను. తిరువాన్కూరు చెఱసాలలోనున్న ఖైదీలచేత నదివఱకు పురవీధులలోఁగూడ పని చేయించుచు వచ్చిరి. రామయ్యంగా రట్టివాడుక మానిపించి ఖైదీలు చెరసాలలోనే పనిచేయునట్లు విధించెను. సంస్థానమందలి ప్రజ లదివఱకు చిల్లరపన్ను లనేకము లిచ్చుకొనుచు వచ్చిరి. ఇవి ప్రజలను వేధించునవి. సర్కారునకు లాభము లేనివి యగుటచే వానిని రూపుమాపెను. ఇవిగాక యా సంస్థానములో మరియొక చిత్రమయిన