పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/450

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
383
వెంబాకం రామయ్యంగారుప్రతి డిపార్టు మెంటులోను చాల మార్పులు చేసెను. ఆయన వెళ్ళునప్పటికి సంస్థానమందలి క్రిమినలు కోర్టులే చట్ట మాధారము లేక యేపద్ధతి ననుసరింపక నియమితమయిన మార్గము లేక వ్యవహారములు జరుపుచుండెను. అది గ్రహించి యాయన యింగ్లీషు ప్రభుత్వములోనున్న శిక్షాస్మృతి (పీనలుకోడ్డు) చర్య స్మృతి (క్రిమినలు ప్రొసీజరు కోడ్డు) తెప్పించి సంస్థానమందలి కోర్టులలో వాడుక చేయించెను. అదివఱకు సంస్థానమందలి పోలీసు బలగము తక్కువజీతములు గలిగి శిక్షలేక నేరస్థులను సరిగా బట్టుకొనలేక మిక్కిలి దుస్థితిలో నుండెను. రామయ్యంగా రీలోపము నివారించుటకు జెన్నపట్టణపు పోలీసుచట్టము దెప్పించి సంస్థానమందు వాడుకచేయించెను. అనంతరము రామయ్యంగారు న్యాయస్థానములను జక్కఁజేయఁ బూనెను. ఆదేశములో స్టాంపుడ్యూటి యెక్కువ పెట్టవలసి వచ్చినను జనులు విశేషముగా వ్యాజ్యములు వేయుచు వచ్చిరేకాని తగ్గలేదు. అందుచేత పని తెమలక కోర్టులో వ్యాజ్యములతో నిండియుండెను. అందుచేత మునసబులకు స్మాలుకాజుల యధికార మిచ్చి వారిజీతములు వృద్ధిచేసి జిల్లాజడ్జీల సంఖ్య తగ్గించి మొత్తము మీఁద న్యాయాధికారుల కందఱకు జీతములు హెచ్చుచేసి మేజస్ట్రీటులకు పోలీసధికారము తీసివేసి యనవసరముగ నధికసంఖ్యగ నున్న మేజస్ట్రీటులను తగ్గించి వారికి యెక్కువ యధికారములిచ్చి తిరువాన్కూరులోనున్న హైకోర్టును దగిన స్థితిలోఁ బెట్టెను. అనంతర మతఁడు రివిన్యూవ్యవహారములఁజక్క జేయనారంభించెను. ఈడిపార్టుమెంటులో న్యాయస్థానములోనున్న పద్ధతులకంటె పురాతన పద్ధతులు చెడుపద్ధతులు బ్రబలియుండెను. ఈ రివిన్యూ శాఖలోనున్న కొలువుగాండ్రకు జీతములు తక్కువ, పనిచేయుటకు సామర్థ్యము