పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/449

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
382
మహాపురుషుల జీవితములునాశనము చేయునట్టి యొకవ్యాజ్యము తేబడెను. ఆ వ్యాజ్యములో రామయ్యంగారుపడిన పాటువలననే పచ్చయ్యప్పగారి పాఠశాలనిలిచెను. విద్యా శాలలయందు రామయ్యంగారికి మిక్కిలి యభిమానముండుటచే పచ్చయ్యప్ప పాఠశాల స్వదేశస్థులయొక్కయు నాంగ్లేయులయొక్కయు నుపాధ్యాయులయొక్కయు విశ్వాసమునకు గౌరవమునకు బాత్రమైన దానిగా జేసెను. రామయ్యంగారు ధర్మకర్తగా నున్న కాలమందె పచ్చయ్యప్ప పాఠశాల సమర్థుఁడగు ప్రాధానో పాధ్యాయుఁడు కలిగి మంచి హైస్కూలులలో నొకటై క్రమ క్రమముగ రెండవ తరగతి కాలేజి యయ్యెను. ఈయన సభికుడుగా నున్న కాలమందె చెంగలరాయ నాయకుడను నతఁడు ధర్మకార్యముల నిమిత్తము వినియోగింపవలసినదని మరణశాసనము వ్రాసి యిచ్చిన యాస్తి ధర్మకర్త యధీనమయ్యెను. ఈ మరణశాసన మనేక సంశయములతో గూడియుండెను. తక్కిన ధర్మకర్తలు రామయ్యంగారి యాలోచనము మన్నించి విని యేసత్కారముల నిమిత్తమా యాస్తియుద్దేశింపబడినదో యాసత్కారములనిమిత్తము వినియోగించిరి. 1880 వ సంవత్సరమందు రామయ్యంగారు దొరతనమువారి కొలువు విడిచిపెట్టి తిరువాన్కూరు మహారాజుగారి యాహ్వానముమీద యా దేశమునకు మంత్రియయ్యెను. ఈయన మంత్రికాకమునుపే యామహారా జుత్తర ప్రత్యుత్తరముల మూలమున రామయ్యంగారి విద్యాసంపత్తి వివేకము గౌరవము పరిపాలన సామర్థ్యము దెలిసికొనుచు వచ్చెను. మహారాజు రామయ్యంగారినిఁ గూర్చి పడిన యభిప్రాయ మంతయు నాయన మంత్రియైన పిదప సరియె యని స్పష్టమయ్యెను. ఆయన తిరువాన్కూరులో నేడు సంవత్సరములు మంత్రియై యుండి యా కాలమందు సంస్థానమందలి