పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/448

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
381
వెంబాకం రామయ్యంగారునడిగిరి. కాని రాజా మాధవరావుగారి వలెనే రామయ్యంగారు కూడ వర్ణ ధర్మము చెడిపోవునను భయమున సీమకు వెళ్ళననిరి. 1875 వ సంవత్సరమందు రిజష్ట్రారు జనరలుపని కాళీరాగా దొరతనమువారు రామయ్యంగారికా పనినిచ్చిరి. 1877 వ సంవత్సరము జనవరి యొకటవ తేదీని ఢిల్లీనగరమున జరిగిన గొప్ప దర్బారునకుఁ జెన్నపురి గవర్నరుగారు రామయ్యంగారి నాహ్వానము చేసిరి. ఆ దర్బారునకు బోయి యాయన గవర్నరు జనరలుగారివలన బంగారు పతకమును బహుమానము వడసిరి. రామయ్యంగారు కాలానుసారముగ నన్నో కమిటీలలో సభికుడై మిక్కిలి యుపయోగములగు పనులంఁ జేసెను. ఆకమిటీలలో గొన్నియిక్కడ పేర్కొనఁబడును. 1. ఇంజనీరింగు డిపార్టుమెంటు స్థాపించుటకై యేర్పడిన కమిటీ. 2. చెన్నపట్టణము మునిసిపలు చట్టము మార్పుచేయుట కేర్పడినకమిటీ. 3. చెన్నపట్టణము మునిసిపాలిటీలో టీకాయల స్థితినిగూర్చి రిపోర్టు చేయుట కేర్పడిన కమిటీ. 4. చెన్నపురి రాజధానిలోనున్న బాలుర చేత నుపయోగింపబడు పుస్తకములను నిర్ణయించుట కేర్పడినకమిటీ. 5. హిందూమత స్థానములు, అనగా దేవాలయములు, మఠములు మొదలగు వాటి పరిపాలనము సరిగా నుండునట్లుచేయుట కేర్పడిన కమిటీ. 6. గ్రామమునసబు నిబంధనలను వ్రాయుటకై యేర్పడిన కమిటీ.

రామయ్యంగారు స్టాంపుల యధికారియైన తరువాత నతఁడు చెన్నపట్టణములో స్థిరముగా నుండునని తెలిసిన పిదప నార్టనుదొరగారాయనను పచ్చయ్యప్ప మొదలియారుగారియాస్తికి ధర్మకర్తగా జేసెను. అట్లు ధర్మకర్తగానుండి యాయన యింతింతనరాని పని జేసెను. పచ్చయ్యప్పగారి పాఠశాలను ధర్మములను మొదలంట