పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/447

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
380
మహాపురుషుల జీవితములురాఁగా నర్భతునాటుదొరగారా సమయమున మాటలాడుచు రామయ్యంగారినిఁ గూర్చి యిట్లు ప్రశంసించిరి. ఆకాలమున నీపాఠశాలలో నొక స్వదేశస్థుఁడనగా నిప్పుడు గవర్నరుగారి శాసననిర్మాణసభలో సభికుఁడుగానున్న యొక పెద్దమనుష్యుఁడు విద్యఁ గఱచుచుండెను. ఆ బడి యిట్టివానిఁ బ్రభవింపఁ జేయగలదని యెన్నడనుకోలేదు. ఆయన సత్ప్రవర్తనముంబట్టియు బుద్ధికుశలతం బట్టియు నీతినిం బట్టియు కార్యా చరణమునందు జూపెడు స్వతంత్రభావముం బట్టియుఁ జూడఁగా మన హిందూరాష్ట్రమందున్న శాసననిర్మాణ సభలలో నెక్కడ నింతవాఁడు లేడని ధైర్యముతోఁ జెప్పగలను. రామయ్యంగారు చెన్నపట్టణము మ్యునిసిపల్ సభలో నెనిమిది సంవత్సరములు సభికుఁడుగ నుండెను. ఆకాలములో నతఁడు పట్టణాభివృద్ధికి మిక్కిలి పాటుపడెను. ఒకసారి యప్పటిగవర్నరు రామయ్యంగారికి మునిసిపల్ ప్రసిడెంటు పనినియ్యఁదలంచెనుగాని రామయ్యంగారే దాని నంగీకరింపడయ్యె. 1871 వ సంవత్సరమందు విక్టోరియారాణిగా రాయనకు సి. యస్. ఐ. యను బిరుదమిచ్చిరి. ఆసమయమందు గవర్నరుగారగు నేపియం ప్రభువు రామయ్యంగారికీ క్రింది యర్థము వచ్చు నట్లింగ్లీషుతో నొకజాబు వ్రాసిరి. "నీకు సి. యస్. ఐ బిరుదువచ్చినది. అది కొద్ది దినములలోనే యథాగౌరవముగా గవర్నమెంటు సెక్రటరీచేత నీ కీయఁబడును. సత్ప్రవర్తనచేతను యోగ్యతచేతను గవర్నమెంటువారి చిరకాలసేవచేతను మిక్కిలి తగినవాఁడవగు నీకు విక్టోరియా రాణీగారు దీనిని దయచేసినందుకు నేనునిన్ను బహూకరించుచున్నాను." 1873 వ సంవత్సరమందున హిందూదేశపు ధనస్థితినిఁగూర్చి పార్లమెంటు సభవా రేర్పచిన కమిటీయెదుట సాక్ష్య మిచ్చుటకై యింగ్లాండు వెళ్ళవలసినదని దొరతనమువారు రామయ్యంగారి