పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/442

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
375
వెంబాకం రామయ్యంగారుతంజావూరుజిల్లా కలక్టరుకచేరీలో హెడ్డుశిరస్తదారుగ నియమింపఁబడెను. నెల్లూరు విడిచిపోవునప్పు డాజిల్లాకలక్టరు రామయ్యంగారి సామర్థ్యాదులం గొనియాడుచు నొకజాబువ్రాసెను. ఆజాబులోనితర విషయములు విడిచి నాలుగు మాటలు మాత్ర మిందుదహరించుచున్నాను. "నీవంటిమనుష్యులే దేశమునకు నిజమైన మిత్రులు. వారే యీదేశమును దక్కిన యెల్ల దేశములలో బేరుకల దానినిగాను యెల్ల సజ్జనుల స్తోత్రమునకు బాత్రమైన దానిగాను జేయగలవారు" ఈయుద్యోగమునం దొక సంవత్సర మున్న పిదప నాయన యాజిల్లాలోనే డిప్యూటీకలెక్టరయి హెడ్డుకలెక్టరునకు నమ్మదగిన సహకారియై యుండెను. 1859 వ సంవత్సరమందు తంజావూరు జిల్లాలోనున్న యీనాము భూములు పరిష్కరింపఁదలచి గవర్నమెంటువారు యీనాము కమీషనరయిన టెయిలరుదొరతోఁ గలసి మాటలాడుటకై రామయ్యంగారిని జెన్నపురము బిలిపించి టెయిలరువద్ద నుద్యోగ మిచ్చిరి. ఆయన చెన్న పట్టణమందుండగానే సర్ ఛార్లెస్ ట్రిమిలియన్ దొరగారాయనం బిలిచి కావేరీనది పాఱెడి భూములలోగొంత భూముల పరిష్కారము గావలసియుండెను. కనుక యచ్చోటికి వెళ్ళవలసియుండునని యాయనతో జెప్పెను. తంజావూరుజిల్లాలో కావేరీనది పారెడిభూములలో రహితులవద్ద శిస్తువసూలుచేయుట కొలుంగు పద్ధతియని యొక పద్ధతియుండెను. ఈ పద్ధతింబట్టి దేశమున పండినపంట హెచ్చుతగ్గుల ననుసరించి రహితులవద్ద శిస్తువసూలుచేయుట కొలుంగుపద్ధతియని యొక పద్ధతియుండెను. ఈపద్ధతిం బట్టి దేశమున పండిన పంట హెచ్చుతగ్గుల ననుసరించి రహితులవద్ద శిస్తు హెచ్చుగాను తగ్గుగానువసూలుచేయఁబడుచు వచ్చెను. స్థిరమైన పద్ధతిలేకయే యేటి కాయేడు మారుచువచ్చిన యీపద్ధతిని మాన్పి శాశ్వతమైన శిస్తు కట్టవలసినదని రామయ్యంగారిని నియమించిరి. అయ్యంగారు వెంటనే యాపనిలోఁ బ్రవేశించి కలెక్టరుగారి యుత్తరువులంబట్టి యెనిమిది మాసములలో నీపని పూర్తిఁజేసెను. ఈపని కొంత జరుగు