పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మహర్షి దేవేంద్రనాథటాగూరు

31



దేవేంద్రనాథుని తండ్రియగు ద్వారకనాథటాగూరు లండనునగరములో మృతినొందెను. తండ్రికుత్తరక్రియ లెట్లుచేయ వలయునని యతనికి సందేహము జనించెను. బ్రహ్మధర్మప్రకారము చేయుట యుక్తమని దేవేంద్రనాథుఁడు తలచెను. టాగూరువంశస్థులు బ్రాహ్మణులగుటచే వేదశాస్త్రముల ప్రకార ముత్తరక్రియలు జరిగింపవలసిన దనియు నట్లు జరిగింపనియెడల కుటుంబగౌరవమునకు భంగము వాటిల్లు ననియు వానిబంధువులు మిత్రులు పలుమారు నొక్కి చెప్పిరి. దేవేంద్రనాథుఁడవి యెల్లఁ బెడ చెవినిఁబెట్టి బ్రహ్మసమాజ ధర్మప్రకారముగఁ దన సైతృకమును నిర్వర్తించెను. అప్పుడు కులస్థులగు బంధుమిత్రులు వాని బహిష్కరించి పరిత్యజించిరి.

ఈ మహాత్ముని మహాధైర్యమును తెలుపుటకీ పై యంశములు చాలునుకాని యితఁడు సత్యసంధుఁడని మహర్షి శబ్దమునకుఁ దగినవాఁడనియుఁ దెలుపుట కింకొక ముఖ్యాంశము గలదు. జనకుఁడగు ద్వారకనాథుఁడు బ్రతికినన్నాళ్ళు మహారాజవైభవముతో బ్రతికి యనేక దానధర్మముల సేయుటంజేసి యాయన మృతిజెందునప్పటి కొక కోటిరూపాయలు ఋణముండెను. అతఁడులోక వ్యవహార వేదియు న్యాయవాదియు నైనందున ఋణప్రదాతలు తన పిత్రార్జితమగు సొత్తుమీదిఁకిం బోకుండ దగు కట్టుబాటులం జేసి చనిపోయెను. వాణిజ్యవ్యాపారముమీఁద నున్న యాస్తియంతయు నప్పులవాండ్ర కొప్పగింపుమనియు వారది పంచుకొని వచ్చినంతపుచ్చుకొనిపోవలయు ననియు నేర్పాటులఁజేసి బంధువులు ఋణప్రదాతల నొప్పించిరి. ఈ యేర్పాటు ధర్మస్వరూపుఁడగు దేవేంద్రనాథునకు నిష్టము లేకపోయె. అప్పు లిచ్చినవాండ్రు చెడిపోఁగూడదని చెప్పి వారిని రావించి జమీ గ్రామములను దక్కిన సొత్తును దీర్మానము నిమిత్తము వారి కొప్పగించి సంవత్సరమునకుఁ గుటుంబరక్షణము నిమిత్త మిరువది వేల