పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/435

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
368
మహాపురుషుల జీవితములుసంస్థానములో ముప్పదిరెండేండ్లు పనిజేసెను. అందుఁ బదునేడేండ్లు మంత్రిపదవియందే యుండెను. చిరకాలమునుండి యాయన శరీరమునకు గావలసిన విశ్రాంతి యప్పుడు లభించుటచేత శేషాద్రయ్యరు చాలకాలము జీవించుననియు నాయన జీవితములో భుక్త శేషము గూడ లోకోపకారార్థమే వినియోగ పడుననియు నెల్లవారలుదలంచిరి కాని దైవమది యోర్వఁడయ్యె సరిగా రెండు సంవత్సరములైనను విశ్రాంతి సౌఖ్యము లనుభవింపక ముందె 1901 సెప్టెంబరు పదమూడవ తారీఖున మిత్రమండలమునకును బంధుకోటికి నపారదుఃఖము కలుగునట్లు శేషాద్రయ్యరు స్వర్గస్థుడయ్యెను.

శేషాద్రయ్యరు మిక్కిలి ప్రసిద్ధుఁడు. ఆయన చరిత్ర మంతకన్న ప్రసిద్ధము. దక్షిణ దేశము మంత్రులకుం బుట్టిన యిల్లని భరతఖండమున వాడుక కలదు. ఏలయన నీదక్షిణ దేశముననేగదా ! దివాను రంగారావు. రాజా మాధవరావు. వెంబాకం రామయ్యంగారు, దివాను రంగాచార్యులు, మహామంత్రి శేషాద్రయ్యరు మొదలగువారు పుట్టిపెరిగి మహాధికారముఁ జేసినది. పైనుదహరింపఁబడిన వారందఱు మంత్రులుగా నుండినను వారి యందరికంటె శేషాద్రయ్యరునకు రెండులాభము లెక్కువ కలిగెను. అందు మొదటి దేదన శేషాద్రయ్యరు మైసూరు సంస్థానమున జిరకాలము పనిజేయుట కవకాశము కలిగెను. తక్కినవారి కీయవకాశము కలుగ లేదు. రంగాచార్యులు రెండుసంవత్సరములు మాత్రమే మంత్రిపని జేసెను. మాధవరావు తిరువాన్కూరునందుఁ గొంతకాలము బరోడాలోఁ గొంతకాలము మంత్రియై యుండెను. కాని నిరంతరాయముగ నొక్కచో నింతకాలము పనిఁజేయ లేదు. శేషాద్రయ్యరు పదునేడు సంవత్సరములు వేరు వేరు పదవులలో నుద్యోగిగాను మైసూరునందే యుండుటచేత సంస్థానముయొక్క గుట్టుమట్టులు దేశస్థులు యాచార్య వ్యవహారములు