పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/432

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
365
సర్. కె. శేషాద్రి అయ్యరురూపాయల శిస్తులధికముగాఁ జెల్లుచువచ్చెను. ఖర్చుల తగ్గించుట, కొత్తమార్పులు చేయుట, యేక కాలముననే జరుగుచు వచ్చెను. అందుచేత సంస్థానము ధనవిషయమున దినదినము మహాద్భుతముగా వృద్ధిపొందెను. ఆయన యధికారమును బూనునప్పటికి సంస్థానమున కున్న ముప్పదిలక్షల ఋణము 1888 వ సంవత్సరమున ననఁగా నై దేండ్ల నాఁటికి సంపూర్ణముగఁతీర్చి వేయఁబడెను. తరువాతనేడేండ్లకనఁగా 1895 వ సంవత్సరమున శేషాద్రియయ్యరు జనప్రతినిధి సభను బిలిపించి యాసభికులతో సంస్థానముయొక్క స్థితిగతులఁ జెప్పునవసరమున నప్పటికి సంస్థానపు ఖజానాలో నొకకోటి డెబ్బదియాఱులక్షల రూపాయలు నిలువయున్నవని జెప్పెను. 1883 వ సంవత్సరమున ననఁగా నీతఁడు క్రొత్తగా మంత్రియైన సంవత్సరము సంస్థానమునకు వచ్చిన శిస్తొక కోటి మూడులక్షలు. శేషాద్రయ్యరు మంత్రిపదవి మానుకొని నప్పుడు సంస్థానముయొక్క శిస్తొకకోటి యెనుబది లక్షలు. ఇట్లతిశయమైన శిస్తుపన్ను లెక్కువకట్టుట వలన గాని ప్రజలంబీడించుట వలనంగాని రాలేదు. శేషాద్రయ్యరు నిరంతర మభివృద్ధిమీదనే దృష్టినిలిపి, పన్నుల యొత్తుడు బ్రజలకు గలుగ నీయక సంస్థానమునకు ధనలాభము కలుగు నుపాయములు వెదకుచు యట్టిపనులందు జొరవతో బ్రవేశించుచు వచ్చెను. ఇంజనీరింగు డిపార్టుమెంటువారిని జాలప్రోత్సాహముజేసి క్రొత్త జలాధారములు దేశమునకు గల్పించెను. ఎక్కువ జాగ్రత్తయు దక్కువ ధైర్యము గల మంత్రులు సాధారణముగా బ్రవేశింప నొల్లని దుర్ల భ కార్యములలో నీతడవలీలగా బ్రవేశించెడువాడు. ఈయన చొరవజేసి ప్రవేశించుట చేతనే బెంగుళూరు జనులు హాయిగా ద్రాగుటకు మంచినీరు లభించెను. ఈయన చొరవ చేయనిచో హగారినదిమీద నానకట్టు కట్టబడక యుండును. ఈ యానకట్టువలన ముప్పదియైదు మైళ్ళ