పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/431

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
364
మహాపురుషుల జీవితములుచేత నేఁ టేఁట దాని వడ్డి నిచ్చుకొను భారమేగాక మఱియొక సారి కాటకము సంభవించునప్పుడు జనక్షయము కాకుండుట కేర్పాటులు చేసికొనవలసిన భారముగూడ సంస్థానముపై బడెను. కాటకముల నివారించుటకు రంగాచార్యులు దేశమున నినుపదారి ప్రబలముగా వేయింప నారంభించెను. శేషాద్రయ్యరు గూడ నాతని మార్గమే యవలంబించి యినుపదారులను వేయింపసాగెను. ఆయన మంత్రియైన రెండు సంవత్సరములలోపున దేశమున రమారమి నూటనలువదిమైళ్ళపొడవుగల యినుపదారి వేయబడెను. దానినిమిత్తమైన కర్చులలో నిరువదిలక్షలు మాత్రమే ఋణమయ్యెను. తక్కిన ధనము సంస్థానపు టాదాయమునుండియే వ్యయము చేయఁబడెను. ఈ యినుపదారి వలనఁ బోగుపడిన ధనము నతఁడు మఱికొన్ని మండలములలో నినుపదారులు వేయించుటకుగా వినియోగించెను. నాలుగేండ్ల తరువాత బెంగుళూరు హిందూపూ రినుపదారి సమాప్త మయ్యెను. అదివఱకు క్షామములకు మిక్కిలి జడిసిన మండలము లన్నియు నినుప దారులచేత జుట్టువడి యెన్ని కఱవులు వచ్చినను భయము లేనిస్థితిలో నుండెను. ఆయన యధికారమును బూనునప్పటికి దేశమున రమారమి యేఁబది యెనిమిదిమైళ్ళ యినుపదారి యుండెను. 1901 వ సంవత్సర మందాయన యుద్యోగము మాను నప్పటికి నాలుగువందలమైళ్ళ యినుపదారి వేయఁబడియుండెను.

ఈయన చేసినపని యొక్క యినుప దారియేకాదు. పొలములకు జక్కని నీటిపారుదలఁ గలిగించుట కీయన విశేష శ్రమపడెను. ఆయన పరిపాలన మారంభించిన మొదటి పన్నెండు సంవత్సరములలో రమారమి కోటిరూపాయలను ఖర్చు పెట్టించి మూడువందల యేఁబదియైదు చదరపుమైళ్ళభూమిని దంపశాగుబడిక్రిందకిఁ దెచ్చెను. ఇట్లు తెచ్చుటవల్ల సంస్థానమునకు సంవత్సరమున కెనిమిది లక్షల