30
మహాపురుషుల జీవితములు
హ మేమని చెప్పుదు. ఆక్షణమందే యేఁబదివేల రూపాయలు పాఠశాలకు మూలధనముగ నొసఁగఁ బడెను.
ఇరువదియెనిమిది సంవత్సరముల ప్రాయముననే దేవేంద్రనాథుఁ డింతపనిఁ జేయుటచే నక్కజపడి పౌరులనేకులు బ్రహ్మసమాజము మంచిదేయని యందుఁ జేరిరి. ఈతెఱంగునఁ బనిసేయుచుండ బ్రహ్మ సమాజ మతస్థులకు నేది ప్రమాణగ్రంథముగ నుండవలయునని వారిలో వారికి సందేహములు గలిగినవి. అక్షయకుమారదత్తు వేదములు పౌరుషేయములగుటచే నప్రమాణము లనియె, కొందఱు వేదములే ప్రమాణములనిరి. కొంతకాలము వాదానువాదములు జరిగినపిదప దేవేంద్రనాథుఁడు తక్కుఁగల సమాజికులు వేదశాస్త్రములు ప్రమాణములు గావనియు, బుద్ధి నుపయోగించి చక్కఁగ విచారించి యాగ్రంథములలో మంచియున్న యెడలగ్రహించి తదితరములఁ ద్రోసివేయవలయుననియు, నిశ్చయించిరి. అనంతరము బ్రహ్మసమాజమతస్థులకు ధర్మశాస్త్ర మేదయిన నుండవలదాయని సందేహముఁ గలుగ దేవేంద్రనాథుఁడా తెగవారి యుపయోగము నిమిత్తము బ్రహ్మధర్మ మనునొకగ్రంథము నిర్మించెను. ఈ గ్రంథమును రచించుట కేండ్లును బూండ్లును బట్టక యతని కొకనాఁడు మూఁడు గంటలసేపు పట్టెనఁట. తనమిత్రు నొకని వ్రాయమని వేదముల నుండియు శాస్త్రములనుండియుఁ దనకుఁ గంఠపాఠముగ వచ్చిన కారికల నద్భుతముగఁ జెప్పెనట. ఈబ్రహ్మధర్మము మొదట సంస్కృతమున వ్రాయఁబడి పిదప నాంగ్లేయభాషలోనికి బంగాళీ మొదలగు స్వదేశభాషలలోనికిని మార్పఁబడి యిప్పుడు దేశమందంతట నుపయోగింపఁ బడుచున్నది.
ఇంతదనుక దేవేంద్రనాథుఁడు మొదలగు బ్రహ్మసమాజ మతస్థులు తమతమ వర్ణములలోనే యుండిరి. 1846 వ సంవత్సరమున