పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/424

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
357
సేలము రామస్వామి మొదలియారిచేసెను. అటు లాఱుసంవత్సరములు మునసబుగా నుండి దొరతనము వారి కొలువులో దన తెలివితేటలు విశేషముగా బ్రకాశించుట కవకాశము లేదని గ్రహించి యాకొలువు మానుకొనెను. అతని కాశాభంగము కలిగినను దొరతనమువారి కొలువుసేయుటవలన నతని సామర్థ్యము న్యాయదృష్టి మొదలగునవి పై యధికారులకు లోకులకు తెలియుటవలన గీర్తిలాభముకలిగెను. అతడుద్యోగము రెండుసారులు మానుకొనదలచినను దమకట్టి యుద్యోగస్థుడు దొరకడని పై యధికారు లాతని విడువరైరి. ఎట్ట కేల కతఁడు దృఢనిశ్చయుఁడై మూడవసారి యుద్యోగమును విడిచి 1882 వ సంవత్సరమునఁ జెన్నపట్టణమున హైకోర్టులో వకీలుగాఁ బనిచేయుటకు బోయెను. ఆయన హైకోర్టులో సాధారణముగ నప్పీళ్ళు పుచ్చుకొని వాదము చేయు చుండెను. ఆయనకుఁ దెలిసినట్లు ధర్మశాస్త్రము (లా) మరియొకరికిఁ తెలియదని యా కాలమున ననేకు లభిప్రాయ పడిరి. ఆయన తన పొట్టపోసికొనుటకు మాత్రమే ధర్మశాస్త్రముల నభ్యసింపక యాశాస్త్రమర్మములను సమూలముగాను సమగ్రముగాను దెలిసికొన నభిలాషగలవాఁడై చదివి లా పత్రిక నొకదానిని స్థాపించి దానికి తానే ప్రధాన ప్రవర్తకుడుగా నుండి 1891 వ సంవత్సరము వఱకునడపెను. చెన్నపట్టణము యూనివరిసిటీవారు రామస్వామి మొదలియారి యొక్క ధర్మశాస్త్ర పాండిత్యమును ద్రవిడభాషా పాండిత్యమును దెలిసికొని యాయనను బి. యల్. పరీక్షకు, యం. యల్. పరీక్షకు ద్రవిడభాషలో బి. యే. పరీక్షకుఁ బరీక్షకుఁడుగా నియమించిరి.

1887 వ సంవత్సరమున యూనివరిసిటిలో నతఁడు ఫెల్లోగా నియమింపఁబడెను. న్యాయవాదిగ నుండి ధనమార్జించుటతోఁ దనివి నొందక మొదలియారి దక్షిణహిందూస్థాన రాజకీయ వ్యవహారములలో బ్రవేశించి దేశాభివృద్ధికి జాల కృషిజేసెను. ఈవ్యవహారము