పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/403

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
340
మహాపురుషుల జీవితములుజాలభాగము పేదలగు విద్యార్థుల విద్యనిమిత్తము ప్రతిమాసము వ్యయము చేయుచుండెను. అట్టిదానములు గుప్తములై యుండును. ఇతరులయందున్న బుద్ధిసూక్ష్మతల నతడు మెచ్చి సంతసించు చుండును. ఆయనకు ముత్తుస్వామియయ్యరును గూర్చి యీక్రింది యభిప్రాయము గలదు. "బుద్ధిసంపదను బట్టిచూడగా నీకాలమున హిందూ దేశమునఁ బుట్టిన వారిలో ముత్తుస్వామియయ్యరే శ్రేష్ఠుఁడు." రంగనాథము మొదలియారుచేసిన గ్రంథమొకటి కలదు. అది కంచి కాలందకమను ద్రవిడ భాషా పద్యకావ్యము.