పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/399

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
336
మహాపురుషుల జీవితములుజూపఁబడు గౌరవము మఱి యేహిందువుని యభిప్రాయమునకు జూపఁబడుట లేదు. ఏయభిప్రాయమయిన జెప్పవలసివచ్చినప్పుడు రంగనాథము మొదలియార్ యొక మనుష్యునకుగాని యొక తెగకుగాని లాభము కలుగునట్టి పక్షపాతపు బలుకుల బలుకక సర్వవర్ణ ములవారి యభివృద్ధికి ననుకూలములగు వచనములఁ జెప్పుచువచ్చెను. విద్యాశాఖలో నేసభగూడినను నేచిన్నకమిటీ యేర్పడినను రంగనాథము మొదలియార్ యందుండవలసినదే. ఏచిన్న తీరుమానమైనను వానిచేతి దిద్దుబాటు బడయని పక్షమున నవి వ్యాసప్రోక్తము కానట్లే యనికమిటీలలోనిమెంబర్లు తలచుచువచ్చిరి. 1890 వ సంవత్సరమందు దొరతనమువారు ద్రవిడభాషాంతరీకరణముఁ జేయుటకు వాని నేర్పఱచుకొనిరి. 1829 వ సంవత్సరము జెన్నపట్టణమున కతఁడు షరీపుగా నియమింప బడెను.

ఒక్క విద్యావిషయమందే గాక ప్రజాక్షేమకరములయిన సమస్త వ్యవహారములందు దొరతనమువారు ప్రజలు రంగనాథుని యాలోచనము గైకొనుచు వచ్చిరి. చెన్నపురి మునిసిపాలిటీయందతఁడొక సభికుఁడై యనేకోపన్యాసముల నిచ్చెను. అవి యెంతో మనోహరములుగ నుండెను. చెన్న పురమందు స్వదేశీయులచేత స్థాపింపబడిన కాస్మాపాలిటన్ క్లబ్బునకు రంగనాథము మొదలియారి ప్రాణమని చెప్పవచ్చును. అతని మృదుమధురసంభాషణము చేత ప్రతి సాయంకాలము సభయంతయు గలకల లాడుచుండెనని వాని నెఱిఁగినవారిప్పటికిఁ జెప్పుదురు. 1890 వ సంవత్సరమందు బట్టపరీక్ష మొదలగు శాస్త్రపరీక్షలయందుఁ గృతార్థులైన విద్యార్థులకు శిష్టాచారముగ జరుగుచున్న హితోపదేశమును జేయునట్లు గవర్నరు గారు రంగనాథము నేర్పఱచిరి. అప్పుడతని నోటనుండి వచ్చిన యింగ్లీషుభాష మార్దవ మేమని చెప్పెను. అప్పు డొక వార్తాపత్రికలో