పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/398

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూండి రంగనాథము మొదలియారి

335



రూపాయలు విలువగల బంగారు పతకము బహుమానము జేయ వలసినదని యా మొత్తమును వడ్డివల్ల గూర్చునట్టి మూలధనమును చెన్నపురి యూనివరిసిటీవారికి 1862 వ సంవత్సరమునం దిచ్చెను. పట్ట పరీక్షయందు మొదటి తరగతిలో నెవరుకృతార్థులు కానందున 1863, 64 సంవత్సరములలో నెవరికి నీయఁబడలేదు. 1865 వ సంవత్సరములో రంగనాథముమొదలియార్ పట్టపరీక్షయందు మొదటి తరగతిలో గృతార్థుడైనందున పతకము వాని కీయఁబడెను.

ఈపతక మొక్కటియేకాదె రంగనాథుడు బహుపతకములను బహుపుస్తకములను బహుమానముగాఁ బడసెను. రంగనాథుని యపార మేథాశక్తికి గురువగు థామ్సను మిక్కిలి సంతసించి వానిని విడువలేక విద్యాభ్యాసము ముగియగానే గణితశాస్త్రమునందు సహాయోపాధ్యాయుఁడుగఁ దన కళాశాలలోనే నియమించెను. రంగనాథముయొక్క మిత్రులు గురువులు విశేషముగ నాంగ్లేయులే యగుట చేత వారి మార్గము ననుసరించి యతఁడు తన కనేకపర్యాయము లితరోద్యోగములు సంపాదించుకొనుట వీలు కలిగినను యవి నిరాకరించి విద్యాశాలయందే యావజ్జీవము గడపెను. చెన్నపురి దొరతనమువారు సమయము వచ్చినప్పుడల్ల రంగనాథుని ప్రజ్ఞాదులం గొనియాఁడుచు వచ్చినను ప్రజ్ఞ కుం దగునట్టి ప్రోత్సాహము మాత్రము సరిగా నీయలేదు. ఏలయన ప్రెసిడెన్సీ కాలేజీలో రంగనాథుడు గణితశాస్త్రోపాధ్యాయుఁడుగా స్థిరపడునప్పటికి రమారమి పదియాఱు సంవత్సరములు పట్టెను.

1872 వ సంవత్సరమున రంగనాథుఁడు చెన్నపురి యూనివరిసిటీలో నొక ఫెల్లో జేయఁబడెను. అది మొదలుకొని యతఁడు చనిపోవువఱకు నేఁటేఁట నీగౌరవము పొందుచునే యుండెను. విద్యా విషయమున రంగనాథము మొదలియార్‌గారి యభిప్రాయమునకు