పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/397

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
334
మహాపురుషుల జీవితములుజీలో బైపరీక్షల చదువుటకుఁ జేరెను. పచ్చయప్ప పాఠశాలాధికారులు చదువుకొనుటకు వానికిఁ నెలకు కొంతసొమ్ము నీయ వాగ్దానము చేసిరి. ప్రెసిడెన్సీ కాలేజీ యాదినములలో మిక్కిలి యున్నత స్థితిలో నుండెను. సాహిత్యము నందు సముద్రుఁడని చెప్పదగిన థామ్సనుదొరగారు దానికి ప్రధానోపాధ్యాయులై యుండిరి. అదివరకాకళాశాలలో బుద్ధిలో బృహస్పతులవంటి విద్యార్థు లనేకులు చదివి కీర్తిమంతులయిరి. కాని రంగనాథము వారి నంద నణగద్రొక్కెను. లోకమం దెవరికైన నొక శాస్త్రమందు విశేషాభిమాన ముండును. రంగనాథుని కన్ననో తత్వశాస్త్రమందు గణితశాస్త్రమందు నాంగ్లేయ సాహిత్యమందు విశేషించి స్వభాషయగు ద్రావిడమందు మహాభిరుచి కలదు. ఆనాల్గింటిలో నతనికతండె సాటియని చెప్పదగి యుండెను.

థామ్సను దొరయు దక్కిన యుపాధ్యాయులు రంగనాథుని యభివృద్ధి నెంతోశ్రద్ధతో జూచినారను టదియొక యాశ్చర్యము కాదు. అప్పటి డైరక్టరయిన పవెలుదొరగారు హాలోవేదొరగారు సయితము రంగనాథుని బుద్ధికుశలతవిని వానియభివృద్ధివిని నుత్సాహపడుచు వచ్చిరి. విద్యార్థిగానున్న కాలముననే మహాపురుషుల యాశ్చర్యమునకు బాత్రుఁడయినవాడు మనలో నితఁ డొక్కఁడే యని చెప్పవచ్చును. అతనికి గణితశాస్త్రమందు నపారమైన ప్రజ్ఞ యున్నను నాంగ్లేయ సాహిత్యమందుఁగూడ నాంగ్లేయు లనేకులే వానికి దీసిపోదురు. ఆతనితో సమానముగ నింగ్లీషువ్రాసి మాథలాడగల తెల్లవారిసంఖ్య తక్కువయని యనేకుల యభిప్రాయము. తిరువాన్కూరు రాజ వంశస్థుఁ డగు రామవర్మ తాను మహారాజు కాకమునుపే చెన్నపురి రాజధానిలో పట్టపరీక్షయందు మొదటి తరగతిలో నెవఁడు కృతార్థుఁ డగునో యావిద్యార్థికి మూడువందల