Jump to content

పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/396

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పూండి రంగనాథము మొదలియారి

333



యొక యుపన్యాసము వ్రాయుమని యుపాధ్యాయుఁడు తరగతిలో బాలురకందఱ కాజ్ఞాపించెను. అది సర్వోత్కృష్టముగవ్రాసిన వారికి గొప్ప బహుమాన మిచ్చునట్లు నిర్ణయము. అనేక బాలకులా విషయములంగూర్చి యుపన్యాసముల వ్రాసిరి. పరీక్షకులచే వ్రాయఁబడిన యుపన్యాసముల వన్నిటిని జదివి రంగనాథము యొక్కయు కుప్పరామశాస్త్రియను మఱియొక బాలకునియొక్కయు వ్రాతలు ప్రశస్తములని యా రెంటిలో నేది ప్రశస్తమో నిర్ణయింపలేక చెన్నపురిలో గొప్పన్యాయవాదులైన నార్టను మెయిను దొరలకుఁ జూపిరి. మెయినుదొర రంగనాథునిదే ప్రశస్తర మనెను. నార్టను కుప్ప రామశాస్త్రి వ్రాసిన దానిని మెచ్చెను. పరీక్షకులు సరిగా నప్పటి నిర్ణయింపలేక హైకోర్టు జడ్జీయగు హాలోవేగారి కుభయుల వ్రాతలం జూపిరి. ఆయన రంగనాథముకే బహుమాన మీయఁదగునని చెప్పెను. కాని యేకారణముచేతనో తుదకు బహుమానము రంగనాథమునకు రాలేదు. అందుకు రంగనాథుడు కుపితుడై తన కెందుచేత బహుమానము రాలేదో యాకారణ మానుపూర్వికఁ గనుగొన నిశ్చయించుకొనెను. అంతలో నతని పాఠశాలయొక్క సంవత్సరోత్సవము వచ్చెను. అయ్యవసరమున జరిగిన సభకు జెన్నపురి గవర్నరుగారగు హారిసు ప్రభువుగా రగ్రాసనాధిపతు లయిరి. ఆయన వచ్చి కూర్చుండిన పిదప రంగనాథుడు లేచి తన యుపన్యాసముఁ జేతపట్టుకొని దానిని గవర్నరుగారికి జూపి యాయన చేతనే తగవు పరిష్కరింప జేసికొనవలయునని బయలుదేర నుపాధ్యాయుడు బాలుని యుత్సాహము గనిపెట్టి తగవు న్యాయముగా బరిష్కరించుర ట్లొడంబడి బలవంతముగ వాని ప్రయత్నము నివారించెను.

1862 వ సంవత్సరమున రంగనాథము మొదలియారీ ప్రవేశ పరీక్షయందు మొదటివాఁడుగ గృతార్థుఁ డయ్యె. ప్రెసిడెన్సీకాలే