పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/390

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

[42]

తండాళం గోపాలరావు

329

గలుగుటచేతను గోపాలరావు యావజ్జీవము విద్యార్థియే యని చెప్పవచ్చును.

గోపాలరావు బుద్ధి యెంతసూక్ష్మమైనదో నడత యంత పవిత్రమైనది. జనులాయన ప్రజ్ఞ కెంతసంతోషించిరో యోగ్యతకు నంతియె సంతోషించిరి. పాండిత్యమునకుఁ బావనచరిత్రము తోడగుట బంగారునకు దావి యబ్బుటగదా ! సత్యమునందు ధర్మమునందు నాయనకు గల యధికప్రీతిచేత నతఁ డొకప్పుడు కఠినముగ భయంకరముగ మాటలాడుచుండును. అందువలన దోషములుచేయువారు వాని యెదుటకు వచ్చుటకు భయపడి గడగడ వడంకుచుందురు. ఇట్లనుటచేత నతఁడు సర్వజన సులభుఁడు కాఁడనియు గఠినస్వభావుఁ డనియుఁ దలఁపగూడదు. ఆయన యందఱకు సులభుఁడు దయానంతుఁడు, తత్వజ్ఞుడు.

గోపాలరావు గొప్ప సంఘసంస్కర్తలలో జేరినవాఁడుకాడు. గాని వాని యభిప్రాయము లన్నియు సంఘసంస్కారమున కనుకూలముగానే యున్నవి. ఆయన మతమున సంస్కారమునకు గావలసిన ముఖ్యవిషయములు నాలుగున్నవి. స్త్రీవిద్య దేశమునందు విశేషముగా వ్యాపింపవలయుననియు, బాల్యవివాహము లడగిపోవలయుననియు నిర్బంధవైధవ్యము లుండగూడదనియు ప్రతివర్ణములోనున్న యంతశ్శాఖ లణగిపోవలయుననియు నాయన తలంచెను. అన్నిటిలో బాల్యవివాహమే మిక్కిలి నష్టకరమని యాతఁడు తలంచెను. అదియే హిందూసంఘవృక్షమును నాశనముచేయు వేరు పురుగు. అది యే వర్ణములో మిక్కిలి వ్యాపించి యున్నదో యావర్ణము ననగా బ్రాహ్మణులను నానాఁటికి క్షీణదశకుఁ దెచ్చుచున్నది. ఆ యగ్రవర్ణమున నీ కాలమున జనించెడు బాలికాబాలకులు తమ పూర్వులట్లు దేహ దార్ఢ్యము గలిగియుండక పొట్టివాండ్రై దుర్బలులై స్వల్పరోగముల