పుట:Mahaapurushhula-jiivitamulu.pdf/370

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది
311
సర్. తిరువఱ్ఱూరు ముత్తుస్వామి అయ్యరుజిల్లాకోర్టులలోను బనిచేయ నర్హులని బ్రకటించినందున ముత్తుస్వామి యాపరీక్షకుఁ జదివెను. ఆ సంవత్సరము పరీక్ష కుంభకోణములో జరిగెను. అనేకులు పరీక్షకువచ్చిరి. అందఱిలో ముత్తుస్వామి యయ్యరు మొదటివాఁడుగ గృతార్థుడయ్యెను. రెండవయతఁడుగ దివానుబహద్దరు రఘునాథరావు కృతార్థుడయ్యెను.

అప్పటి ప్లీడరుపరీక్ష యిప్పటివలెగాదు. ఆకాలమున బరీక్షితులు (పరీక్షకు వచ్చినవారు) కోర్టులోనుండి తెచ్చిన ప్రాతరికార్డు నెవరో యొకరు చదువగా విని తాము విన్న యాసంగతులం బట్టి యావ్యాజ్యములో నొకతీర్పు నక్కడనే వ్రాయవలయును. కుంభకోణములో జరిగిన యాపరీక్షకును తంజావూరుజిల్లాజడ్జీ స్వయముగా వచ్చి నడపి పరీక్షితులు తీర్పు వ్రాయవలసిన విషయమున నొక ప్రాఁతవ్యాజ్యము రికార్డు దెప్పించి యది చదువుమని సిరస్తదారున కాజ్ఞాపించెను. సిరస్తదారు మిక్కిలి వడివడిగా జదివినందున ముత్తుస్వామి విస్పష్టముగా జదువుమని వానితో ఘర్షణము పడెను. జడ్జీ యదివిని సిరస్తదారును మెల్లిగా జదువుమని మందలించి తానుగూడ పరీక్షింపఁబడ వచ్చిన వారిలో నొకడుగా భావించుకొని బల్ల వద్ద గూర్చుండి సిరస్తదారు చదివిన యంశమునకు తానుగూడ నొక తీర్పు వ్రాయ సమకట్టెను. ఆ యంశములమీఁద ముత్తుస్వామియయ్యరు వ్రాసిన తీర్పు జడ్జీవ్రాసిన తీర్పు సరిగా నుండెను.

ఆతని శాస్త్రజ్ఞానమునకుమెచ్చి యీజడ్జి స్వల్ప కాలములోనే ముత్తుస్వామి యయ్యరును ట్రాంక్వెబారు పట్టణములో డిస్ట్రిక్టుమునసబుగా నియమించెను. ఆయుద్యోగములో ముత్తుస్వామి యయ్యరు చూపిన బుద్ధికుశలత నెల్ల వారుమెచ్చి పొగడిరి. ఆ జడ్జీ యొకసారి యీమునసబుగారి కచ్చేరి యాకస్మికముగా పరీక్షింపవలెనని తన రాక వానికిఁ దెలియఁబరచకుండ ట్రాంక్వెబారునకుబోయెను. ఆతని